JAISW News Telugu

Tiger in Hajipur : హాజీపూర్ మండలంలో పెద్దపులి.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

FacebookXLinkedinWhatsapp
Tiger in Hajipur

Tiger in Hajipur

Tiger in Hajipur : మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ధర్మారం, టీకనపల్లి గ్రామాల పరిధిలోని అటవీ ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపింది. మంగళవారం బుగ్గగట్టు ప్రాంతంలో గొర్రెల మందపై దాడిచేసి మూడు గొర్రెలను హతమార్చింది. గమనించిన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పాదముద్రల ఆధారంగా పెద్దపులిగా గుర్తించారు. అప్రమత్తంగా ఉండాలని సమీప గ్రామాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీచేశారు.

Exit mobile version