Business Titans Award : సోనూసూద్ చేతుల మీదుగా డా. జై గారికి ‘బిజినెస్ టైటాన్స్’ అవార్డ్
Business Titans Award – Dr Jai :యూ బ్లడ్ ఖ్యాతి ఎల్లలు దాటుతోంది.. రక్తదానం మహాదానం అంటూ డా.జై, జగదీష్ బాబు యలమంచిలి గారు ఎంతో మంది ప్రాణాలు కాపాడాలనే సదుద్దేశంతో రూపొందించిన యాప్ ‘యూ బ్లడ్’. ఈ యాప్ ద్వారా ఇప్పటికీ ఎంతో మంది లబ్ధిపొందారు. అంతటి మహోన్నత క్రతువు ఇప్పుడు అబుదాబి వేదికగా మరోసారి మారుమోగింది.
ఈ యాప్ కోసం యూబ్లడ్ ఫౌండర్ జై, డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారు చాలా శ్రమించారు. యాప్ ను రూపొందించడమే కాకుండా ప్రచార బాధ్యతలు, తదితరాలను దగ్గరుండి చూసుకున్నారు. ఇది ఒక దేశానికో ఒక ప్రాంతానికో పరిమితం కావద్దనే దీన్ని యాప్ రూపంలో తీసుకువచ్చారు ఫౌండర్ జగదీష్ బాబు గారు. ప్రపంచంలో స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ ఉన్న ప్రతీ చోట యూ బ్లడ్ సేవలు అందుబాటులో ఉంటాయి. యాప్ ఇన్ స్టాల్ చేసుకొని సైన్ ఇన్ అయి. మీరు డోనర్ గా నమోదైతే చాలు మీ బ్లడ్ ఎవరికి కావాలో వారికి ఇవ్వవచ్చు. మీకు, మీ కుటుంబ సభ్యులకు బ్లడ్ కావాలంటే కూడా డోనార్ ను కనుగొనవచ్చు.
ఈ కాన్సెప్ట్ నచ్చిన సోనూసూద్ యూ బ్లడ్ కు అంబాసిడర్ వ్యవహరిస్తున్నారు. ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్న ఇలాంటి యాప్ లతో సమాజానికి మరింత మేలు కలుగుతుందని ఆయన చాలా సందర్భాల్లో యూ బ్లడ్ గురించి మాట్లాడారు. ఫౌండర్ కు ఇలాంటి ఆలోచన రావడాన్ని ఆయన ప్రశసించారు కూడా.
తాజాగా సమాజానికి డా.జై గారికి చేస్తున్న సేవలను గురించిన ‘బిజినెస్ టైటాన్స్’ సంస్థ అబుదాబిలో సోనూసూద్ చేతుల మీదుగా డా.జై గారికి అవార్డును అందజేశారు. ‘బిజినెస్ టైటాన్స్’ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా పేరుంది.. రెండు దశాబ్దాల అసమానమైన నాయకత్వంతో, ‘రేడియో సిటీ’ పేరుతో వివిధ వ్యాపార ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వారి ఆవిష్కరణలు కొనసాగాయి. దేశవ్యాప్తంగా బహుళ వ్యాపారాలకు ప్రోత్సాహం అందించారు. నిరంతర ప్రేరణగా నిలిచారు. దీన్ని మరింత ముందడుగు వేస్తూ, 2022లో, రేడియో సిటీ ‘బిజినెస్ టైటాన్స్’ను ప్రారంభించింది. ఇది భారతీయ పారిశ్రామికవేత్తలు వారి వ్యాపార నైపుణ్యం , ఆవిష్కరణలు చేసిన వారి విజయాన్ని ప్రశంసిస్తూ అవార్డులను అందజేస్తుంది. ఒక రకమైన అంతర్జాతీయ గొప్ప అవార్డుగా చెప్పొచ్చు. ఈ సంస్థ అవార్డు గ్రహీతల పట్టుదల , నాయకత్వ చతురత కోసం వ్యాపార నాయకుల విజయాలకు మద్దతు ఇవ్వడం.. జరుపుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది.
బిజినెస్ టైటాన్స్ ‘చాప్టర్ దుబాయ్’ మొదటి ఎడిషన్ అద్భుతంగా సాగింది. ఇది ప్రముఖ భారతీయ వ్యాపార దిగ్గజాలు, వివేక్ ఒబెరాయ్, నేహా ధూపియా, సోఫీ చౌదరి మరియు కైనాత్ అరోరా వంటి ప్రముఖ బాలీవుడ్ ప్రముఖులతో అభివృద్ధి చెందుతున్న పారిశ్రామికవేత్తలకు ప్రశంసలు అందజేస్తూ, విజేతలకు అవార్డులను అందజేశారు.
బిజినెస్ టైటాన్స్ ఈసారి యూబ్లడ్ ద్వారా సేవ చేస్తున్న డా.జై గారికి సోనూసూద్ ద్వారా అవార్డును అందింపచేసింది. డా.జై గారి సేవలను అంతర్జాతీయ వేదికపై అందరూ కొనియాడేలా చేసింది.
బిజినెస్ టైటాన్స్ సంస్థ వినియోగదారు ఉత్పత్తులు, విద్య, సేవలు, IT, రియల్ ఎస్టేట్, ఆరోగ్యం & ఫిట్‌నెస్, దుస్తులు/ దుస్తులు, మీడియా/ వినోదం, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, F&B, ఫైనాన్స్ వంటి వివిధ వర్గాల నుండి 90 మంది విప్లవాత్మక పారిశ్రామికవేత్తలను ఫార్మా, ఆటో, ట్రావెల్, స్టార్టప్‌లు మరియు ఇతరులు కూడా ఇందులో ఉన్నారు.