Peddapalli : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్ లో ఆదివారం ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందారు. సీఐ సుబ్బారెడ్డి, స్థానికులు తెలిపిన ప్రకారం.. సుల్తానాబాద్ మండలం చిన్నబొంకూర్ కు చెందిన మల్యాల వెంకటేశ్ తన మొక్కజొన్న చేనులో కంకుల పొట్టు తీయడానికి ట్రాక్టర్ లో తన భార్యతో పాటు 8 మంది మహిళా కూలీలను తీసుకెళ్లాడు.
పనులు ముగిశాక అదే ట్రాక్టర్ లో మొక్కజొన్న కంకులతో పాటు కూలీలను ఎక్కించుకొని తిరిగి ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో ట్రాక్టర్ అదుపు తప్పి ఎస్సారెస్పీ డీ-86 ఉపకాల్వ 33ఎల్ కాల్వలో పడింది. ఈ ప్రమాదంలో పోచంపల్లి రాజమ్మ (55), భేతి లక్ష్మి (52) అక్కడికక్కడే మృతి చెందగా, వెంకటేశ్ భార్య వైష్ణవి (32)ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయింది. మరో ఐదుగురు కూలీలు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు పోలీసలు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.