Purandeshwari : ఏపీలో మూడు చోట్ల కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి తెలిపారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలో ఉండటంతో ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం, శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా దగదర్తి, శ్రీకాకుళం జిల్లా మూలపేటలో కొత్తగా విమానాశ్రయాలు ఏర్పాటు చేయగలుగుతున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి, కనెక్టివిటీ పెంపుతో పాటు ఆర్థిక పురోగతికి కూడా ప్రోత్సాహం అందిస్తున్నట్లు వెల్లడించారు.
సీఎం చంద్రబాబు సైతం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చిన్న ఎయిర్ పోర్టులు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో భోగాపురం విమానాశ్రయ పనుల్లో వేగం పెరిగింది. సీఎం ఇటీవల అక్కడ పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు.