JAISW News Telugu

T20 World Cup 2024 : ఒకే రోజు మూడు మ్యాచులు..

T20 World Cup 2024

T20 World Cup 2024

T20 World Cup 2024 : టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా ఒక్క రోజే మూడు మ్యాచులు జరగనున్నాయి. గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో పపువా న్యూగినియా, ఉగాండా మధ్య తొమ్మిదో మ్యాచ్ భారత కాలమానం ప్రకారం.. ఉదయం 5 గంటలకే ప్రారంభం కానుంది. అనంతరం ఉదయం ఆరు గంటలకు ఆస్ట్రేలియా, ఓమన్ మధ్య కెన్నింగ్ టన్ ఓవల్ బార్బడోస్ లో 10 మ్యాచ్ జరగనుంది.

రాత్రి తొమ్మిది గంటలకు పాకిస్థాన్, యూఎస్  మధ్య కీలక పోరు జరగనుంది. పాకిస్థాన్, యూఎస్ మ్యాచ్ మాత్రం డల్లాస్ లోని గ్రాండ్ పార్లీ స్టేడియంలో ఇండియా టైం ప్రకారం.. రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభం కానుండగా.. ఎలాగైనా పాక్ ను ఓడించాలని యూఎస్  ప్లేయర్లు ప్లాన్ చేస్తున్నారు. యూఎస్ఏ ప్లేయర్లలో ఎక్కువ మంది ఇండియన్ క్రికెటర్లు ఉండటం విశేషం. కెప్టెన్ కూడా ఇండియా సంతతి క్రికెటర్ కావడంతో అభిమానులు అమెరికాకే మద్దతు తెలుపుతున్నారు.

ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ మరో 22 రన్స్ చేస్తే టీ 20 క్రికెట్ లో ఆస్ట్రేలియా తరఫున అరోన్ పించ్ చేసిన  3120 పరుగుల రికార్డును బద్దలు కొడతాడు. ఆస్ట్రేలియా టీంకు మిచెల్ మార్ష్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఓమన్ కు అకిబ్ ఇల్లియాస్ సారథ్యం వహిస్తున్నాడు. ఓమన్ మొదటి మ్యాచ్ లో నమీబియాపై పోరాడి ఓడిపోయింది. సూపర్ ఓవర్ లో నమీబియా బ్యాటర్లు చెలరేగి ఆడటంతో ఓమన్ ఓటమి చెందక తప్పలేదు.

ఆస్ట్రేలియాతో ఆడే అవకాశం రావడం ఓమన్ కు కలిసొచ్చే అంశం. ఇప్పటి వరకు క్రికెట్ లో ఆస్ట్రేలియానే పెద్దన్న. అలాంటి అగ్రశ్రేణి జట్టుతో పోరాడాల్సి రావడంతో ఓమన్ చెమటోడ్చక తప్పదు. మరో పక్క పసికూనలైన ఉగాండా, పపువా న్యూ గినియా మధ్య పోరులో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి. ఇప్పటికే ఈ సిరీస్ లో  పపువా వెస్టిండీస్ పై ఓడిపోతే.. ఉగాండా అఫ్గానిస్తాన్ చేతిలో చిత్తయింది.

Exit mobile version