JAISW News Telugu

Sunrisers : సన్ రైజర్స్ రిటైన్ లిస్ట్ లో ముగ్గురు విదేశీ ప్లేయర్లు

Sunrisers

Sunrisers

Sunrisers : ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2025 కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. గత సీజన్‌లో ఐపీఎల్ టైటిల్‌ కు దూరమైన  సన్‌రైజర్స్ హైదరాబాద్ మెగా వేలానికి తాము రిటైన్ చేసిన ప్లేయర్లను ప్రకటించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదుగురు బలమైన ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. సన్ రైజర్స్  తమ జట్టులో పాట్ కమ్మిన్స్, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్‌లను కొనసాగించింది. దీంతో పాటు అభిషేక్ శర్మ కూడా నితీష్ కుమార్ రెడ్డిని తమ వద్దే ఉంచుకుంది.

ఐదుగురు టాప్ ప్లేయర్లే..

ఐపీఎల్ 2024లో పాట్ కమిన్స్ కెప్టెన్సీలో జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. కమిన్స్ కెప్టెన్సీలో బ్యాట్స్‌మెన్ రాణించారు. బౌలింగ్‌లో కమిన్స్ కెప్టెన్సీ వల్ల జట్టుకు ప్రయోజనం కూడా లభించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అపారమైన కెప్టెన్సీ అనుభవం ఉన్న కమిన్స్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ వేలానికి వెళ్లనివ్వకూడదని
సన్ రైజర్స్ భావించింది.  అందుకే అతడిని తిరిగి కొనసాగించాలని జట్టు నిర్ణయించింది. సన్ రైజర్స్ గత వేలంలో 20.5 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని చెల్లించి కొనుగోలు చేసింది.

గత సీజన్‌లో బ్యాట్‌తో చెలరేగిన హెన్రిచ్ క్లాసెన్‌ను కూడా వేలానికి వెళ్లకుండా ఉంచుకున్నది. ఐపీఎల్ -2024లో క్లాసెన్ 15 ఇన్నింగ్స్‌ల్లో 479 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 171.07గా ఉంది. హెడ్ , అభిషేక్ తర్వాత జట్టులో అత్యధిక పరుగులు చేసిన మూడో ప్లేయర్ క్లాసెన్. ఈ డేంజరస్ బ్యాట్స్ మెన్ ను తనవద్దే ఉంచుకుంది.   ఐపీఎల్ 2024లో అభిషేక్ 16 ఇన్నింగ్స్‌ల్లో 204.21 స్ట్రైక్ రేట్‌తో 484 పరుగులు చేశాడు. అతను ఐపీఎల్ 2024లో హెడ్ తర్వాత జట్టులో అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్. అభిషేక్ శర్మ ఫామ్‌ను చూసిన యాజమాన్యం ఈ యంగ్ ప్లేయర్ ను జట్టులో ఉంచుకోవాలని నిర్ణయించుకుంది.

 సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాలో  పాట్ కమిన్స్, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి ఉన్నారు.

ఐపీఎల్ -2024లో సన్‌రైజర్స్ జట్టు : యాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, అన్మోల్‌ప్రీత్ సింగ్, షాబాజ్ అహ్మద్, నితీష్ కుమార్ రెడ్డి, ఉపేంద్ర సింగ్, సన్వీర్ సింగ్ , మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్, ఆకాష్ సింగ్, జత్వేద్ సుబ్రమణియన్, పాట్ కమిన్స్ (కెప్టెన్), ఐడెన్ మార్క్రామ్, గ్లెన్ ఫిలిప్స్, ట్రావిస్ హెడ్, ఫజల్హాక్ ఫారూకి, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్, వనీందు హసరంగా.

Exit mobile version