Elephants died : విద్యుదాఘాతంతో మూడు ఏనుగులు మృతి

elephants died
elephants died : అడవి పందులను పట్టుకునేందుకు వేటగాళ్లు వేసిన విద్యుత్ ఉచ్చు తగిలి దూడ సహా మూడు ఏనుగులు మృతి చెందాయి. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున భువనేశ్వర్ జిల్లాలోని రాయఖోల్ అటవీ డివిజన్ పరిధి నక్తిదేవుల్ పరిధిలో చోటు చేసుకుంది.
సోమవారం తెల్లవారు జామున నక్తిదేవుల్ లోని బురమల్ అటవీ ప్రాంతంలో ఏనుగుల కళేబరాలను గ్రామస్థులు మొదట చూశారు. అనంతరం సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, పోలీసులతో కలిసి ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టి విద్యుత్ ఉచ్చును వెలికితీశారు. ఏనుగుల మృతదేహాలను పరీక్షల నిమిత్తం తరలించారు.