Canada : వెయిటర్, సర్వెంట్ ఉద్యోగాల కోసం కెనడాలో వేలాది మంది భారతీయుల క్యూ
కెనడాలో వెయిటర్ ఉద్యోగాల కోసం క్యూలో నిలబడిన భారతీయ విద్యార్థుల వీడియోని రమణదీప్ సింగ్ మాన్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పంచుకున్నారు. వీడియోను షేర్ చేస్తూ.. ‘బ్రాంప్టన్‌లోని ఒక రెస్టారెంట్ కొన్ని వెయిటర్ ఉద్యోగాల కోసం ప్రకటన చేసింది. దీని తర్వాత దాదాపు 3000 మంది విద్యార్థులు ఇంటర్వ్యూకు వచ్చారు. ఉద్యోగాల కోసం వచ్చిన ఈ విద్యార్థుల్లో ఎక్కువ మంది భారతీయులే.’ అంటూ రాసుకొచ్చారు.
కెనడాలో అధ్వాన్నంగా ఉన్న ఉపాధి పరిస్థితితో పాటు గృహాల కొరత జీవన వ్యయం గణనీయంగా పెరిగిందని రమణదీప్ సింగ్ అన్నారు. దీంతో అక్కడి ప్రజలు, ముఖ్యంగా విదేశీయులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారు కలలతో కెనడా వెళ్తున్న విద్యార్థులు మరోసారి ఆలోచించుకోవాలి. కెనడాలో కొన్ని నెలల్లోనే ఇలాంటి ఎన్నో ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది జూన్‌లో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. టొరంటోలోని టిమ్ హార్టన్స్ అవుట్లెట్ వెలుపల ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల సుదీర్ఘ క్యూ కనిపించింది. ఈ ఫాస్ట్ ఫుడ్ చైన్‌లో చిన్న ఉద్యోగం కోసం చూస్తున్న ఈ విద్యార్థుల్లో ఎక్కువ మంది భారతీయులు కూడా ఉన్నారు.