Civil Supplies Corporation Chairman : రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ గా తోట మెహర్ సీతారామ సుధీర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ జిల్లాకు చెందిన జనసేన పార్టీ నాయకుడు సుధీర్ ను కూటమి ప్రభుత్వం ఇటీవల సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించిన సంగతి తెలిసిందే. సోమవారం విజయవాడలోని సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సుధీర్, మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. సుధీర్ తో పాటు మరో 15 మందిని కార్పొరేషన్ డైరెక్టర్లుగా ప్రభుత్వం నియమించింది. వారిలో సగం మంది సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. మోకా ఆనందసాగర్ (ముమ్మడివరం), తుమ్మల పద్మజ లక్ష్మి (పెద్దాపురం), కడలి ఈశ్వరి (కాకినాడ), బోడపాటి శివదత్ (పాయకరావుపేట), తోట పార్థసారథి (మంగళగిరి), వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి (నెల్లూరు సిటీ), కేసన కోటేశ్వర్ (తెనాలి) ప్రమాణ స్వీకారం చేశారు.