JAISW News Telugu

Two Ministers : ఆ ఇద్దరు మంత్రులే అఫీషియల్ అట! స్వయంగా రేవంత్ చెప్పారట!

Two Ministers : తెలంగాణలో ఒక డిఫరెంట్ సంప్రదాయం మొదలైంది. ప్రభుత్వంలో మంత్రులు మాట్లాడితే అది అఫీషియల్ కాదట.. కేవలం పొంగులేటి శ్రీనివాస రెడ్డి, శ్రీధర్ బాబు మాట్లాడేదే అఫీషియల్ అట. ఈ విషయాన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. ఇటీవలి కాలంలో సమన్వయ లోపంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురవుతున్న ఇబ్బందులు రేవంత్ రెడ్డికి ప్రభుత్వం నడపడంపై పట్టు లేదని జరుగుతున్న ప్రచారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కొందరు సీనియర్ మంత్రులు ఇష్టం వచ్చినట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వ విధానపరమైన అంశాల్లో పార్టీలో కనీసం చర్చ లేకుండా.. ప్రభుత్వంలో ప్రతిపాదనలు కూడా లేకుండా ప్రకటనలు చేస్తున్నారు. దీంతో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ గందరగోళానికి చెక్ పెట్టాలని రేవంత్ రెడ్డి అనుకున్నట్లు చెప్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఐఅండ్‌పీఆర్ మినిస్టర్. ఆయన చెప్పేదే అధికారికం. ఇక ఆయనకు శ్రీధర్ బాబును తోడివ్వడం.. వారు చెప్పేదే అధికారికం అని నొక్కి వక్కాణించడం రేవంత్ లో వచ్చిన మార్పుగా అంచనా వేస్తున్నారు.

రేవంత్ కు పాలనా పరంగా ఇప్పుడు ఎలాంటి ఆటంకాలు లేవు.. ఇప్పుడు కోడ్ కూడా లేదు. ఇక పూర్తి స్థాయిలో ఆయన ముద్ర చూపించాల్సి సమయం వచ్చింది. సీనియర్లు అడ్డం పడ్డారు.. చేత కాలేదు అని చెప్పేందుకు అవకాశం లేదు. అందుకే మెల్లగా అధికార యంత్రాంగంపై పూర్తి పట్టు సాధించేందుకు.. అనవసర గందరగోళానికి తెరదింపేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఏ మంత్రి కూడా స్పందించలేదు. పార్టీలో అంతర్గతంగా గందరగోళం జరిగేందుకు ఎంతో కొంత ఆస్కారం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Exit mobile version