JAISW News Telugu

Deep Fake Scam : డీప్ ఫేక్ స్కామ్ లోకి అంబానీలతో పాటు ఆ పొలిటీషియన్లు.. దేశవ్యాప్తంగా కలకలం

Deep Fake Scam

Deep Fake Scam

Deep Fake Scam : డీప్ ఫేక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ టెక్నాలజీతో హీరోయిన్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రష్మిక రెండు సార్లు వీటి భారిన పడింది. అంతెందుకు సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఒకటి, రెండు సార్లు వీటికి బలయ్యాడు.

అయితే ఒక గేమ్ యాప్ ప్రమోషన్ కోసం డీప్ ఫేక్స్ ను ఉపయోగించుకొని ప్రమోషన్ కు పాల్పడుతున్నారు కొందరు. అనంత్ అంబానీ, నీతా అంబానీ, గౌతమ్ అదానీ, పొలిటీషియన్ యోగి ఆదిత్యనాథ్ వంటి ప్రముఖులు కూడా ఏవియేటర్ అనే గేమింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్నారు. డీప్ ఫేక్ ద్వారా క్రియేట్ చేసినవి వాస్తవానికి చాలా దగ్గరంగా ఉంటాయి. వీటిని చూస్తే డీప్ ఫేక్ అని ఎవరూ గుర్తించరు. దీంతో చాలా మంది ఇది సాక్షాత్తు అంబానీలే చెప్పారని నమ్మి మోసపోతున్నారు.

కొన్ని వారాల క్రితం బయటకు వచ్చిన వీడియోలు ఇటీవల బాగా పాపులర్ అయ్యాయి. యాప్ లో గేమ్ ఆడేవారు పెద్ద మొత్తంలో నగదు బహుమతులను ఎలా గెలుచుకోవచ్చో అనంత్ అంబానీ ఈ యాప్ లో మాట్లాడడం, వారి డబ్బు 5 టైమ్స్ రెట్టింపు చేస్తామని, వారు కోల్పోయిన మొత్తానికి రెట్టింపు ఇస్తామని వాగ్ధానం చేసినట్లు వీడియో క్రియేట్ చేశారు.

మరొక వీడియోలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ యాప్ ద్వారా కోట్లు సంపాదించారని డీప్ ఫేక్ ఉంది. ఏవియేటర్ యాప్ నకు ఎండార్స్ మెంట్స్ లా కనిపించేలా ఈ వ్యక్తుల రియల్ టీవీ ఇంటర్వ్యూలను తారుమారు చేసి ఈ ఫేక్ వీడియోలను రూపొందించారు. దేశంలో ఈ ధోరణి ప్రస్తుతం పెరుగుతూ వస్తోంది. ఇది నిజంగా వారే క్రియేట్ చేశారా? అన్న అనుమానం కలుగకుండా చిత్రీకరిస్తున్నారు.

గతంలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి వంటి క్రికెటర్లను కూడా డీప్ ఫేక్ యాడ్స్ టార్గెట్ చేశాయి. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి ప్రముఖ రాజకీయ నాయకులకు సంబంధించిన అనేక మానిప్యులేటెడ్ వీడియోలు ఆన్ లైన్ లో చక్కర్లు కొట్టాయి.

Exit mobile version