JAISW News Telugu

Glass Symbol : ముందే జాగ్రత్త పడితే ఇలా జరిగి ఉండేది కాదు కదా!

Glass Symbol

Janasena Glass Symbol

Glass Symbol : ఆంధ్రప్రదేశ్ లో పార్టీలకు గుర్తులు కేటాయించారు. వైసీపీది ఫ్యాన్ గుర్తు. టీడీపీది సైకిల్ గుర్తు. జనసేనకు గాజు గ్లాస్ గుర్తు ఇచ్చారు. దీంతో ప్రచారంలో దూకుడుగా వెళ్తున్నారు. తమ గుర్తులను ప్రచారం చేసుకుంటూ హోరెత్తిస్తున్నారు. గుర్తును పోలిన గుర్తులుంటే పార్టీలు అడ్డు చెబుతాయి. ఎందుకంటే క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే భయం వారిని వెంటాడుతుంది.

జనసేనకు గాజు గ్లాస్ గుర్తు అప్పగించింది. జనసేన పార్టీ పోటీలో లేని చోట గాజు గ్లాస్ గుర్తును స్వతంత్రులకు కేటాయిస్తోంది. దీంతో క్రాస్ ఓటు ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. తమ గుర్తును వేరే వారికి కేటాయించొద్దని ఈసీని జనసేన కోరుతోంది. కూటమి రెబల్స్ ఉన్న చోట గాజు గ్లాస్ గుర్తు ఇతరులకు కేటాయిస్తే తమకు ఇబ్బందిగా మారుతుందని వాదిస్తున్నారు.

ఎన్నికల సంఘం గుర్తింపు లేకపోవడంతోనే జనసేనకు పర్మినెంట్ గుర్తు కేటాయించలేదు. జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే విషయం ఈసీకి తెలియదు. దీంతో జనసేనకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించిందని తెలుస్తోంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసి గుర్తులు కేటాయించే వరకు ఫ్రీ సింబల్స్ లో గ్లాస్ ఉందని తెలిసి ఈసీ దగ్గరకు అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఫలితం కనిపించడం లేదు.

కూకట్ పల్లి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ గుర్తుతో పోటీ చేసిన అభ్యర్థికి రెండు వేల ఓట్లు వచ్చాయి. ఇప్పుడు గాజు గ్లాస్ అందరిలో చర్చనీయాంశంగా మారింది. తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో కూడా ఓ అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంతో అతడికి నాలుగు వేల ఓట్లు వచ్చాయి. ఇలా గాజు గ్లాస్ గుర్తు వల్ల జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యులవుతారని ప్రశ్నిస్తున్నారు.

దీంతో ప్రస్తుతం గాజు గ్లాస్ గుర్తు వల్ల రాష్ట్రంలో ఎదురయ్యే పరిణామాలపై జనసేన భయపడుతోంది. క్రాస్ ఓటింగ్ జరిగితే మోసం జరుగుతుందని ఆక్షేపిస్తోంది. తమ గుర్తు స్వతంత్రులకు ఇవ్వొద్దని చెబుతోంది. కానీ ఈసీ మాత్రం వారి కోరికను మన్నించడం లేదు.

Exit mobile version