JAISW News Telugu

Chandrababu Vs Jagan : చంద్రబాబు సంస్కారానికి.. జగన్ సంస్కారహీనానికి నిదర్శనమీ వీడియో

Viral Video

Chandrababu Vs Jagan Viral Video

Chandrababu Vs Jagan : ఏపీలో ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు బిజీబిజీగా ఉన్నాయి.  ఈ ఎన్నికల్లో ఎలాగైనా జగన్ పార్టీని గద్దెదించాలని ఎన్డీఏ కూటమి భావిస్తోంది. ఇక ఓటమి తప్పదనే ఫ్రస్టేషన్ లో సీఎం జగన్ ప్రతిపక్ష పార్టీలు, కుటుంబ సభ్యులపై ఇష్టారీతిన విమర్శలు చేస్తున్నారు. సంస్కారం అనేది మరిచిపోయి తాను తిట్టడమే కాదు..తన పార్టీ శ్రేణులతో వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై బూతులు మాట్లాడిస్తున్నారు.

రాజకీయాల్లో నేతలు హుందాగా, మర్యాదగా ప్రవర్తించాలి. సంస్కారంతో మాట్లాడాలి. ఒకవేళ తమను ఎవరైనా విమర్శిస్తే సంయమనం కోల్పోకుండా హుందాగా ప్రతి విమర్శ చేయాలి. అలాంటప్పుడే శ్రేణులకు ఆదర్శంగా నిలుస్తారు. కానీ ఏపీలో వైసీపీ నేతలకు అవేమి తెలియవు. వారు తీరు ఎలా ఉంటుందో తెలియజెప్పే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోను చూస్తే మనకే అర్థమవుతుంది ఏ నేతలు ఎలాంటివారో..

ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఒకసారి చూద్దాం.. టీడీపీ సభలో ఓ వ్యక్తి అధికార పార్టీ నేతలపై వ్యక్తిగతంగా ఏదో మాట్లాడబోతుంటే..అధినేత చంద్రబాబు అతడిని వారించి..‘‘తమ్ముళ్లు వ్యక్తిగతంగా పోవద్దు..ఆవేశం ఉంటుంది..నిబ్బరంగా ఉండాలి. మనం చేసే పనులు చెప్పాలి తప్ప వ్యక్తిగతంగా పోవద్దు..తెలుగుదేశం పార్టీ హుందాతనానికి మారుపేరు..తుదివరకు అవసరమైతే పోరాడి విజయం సాధిస్తాం తప్ప వెనక్కితగ్గేది లేదు.’’ అంటూ హితువు పలికారు.

ఇక అదే వీడియోలో వైసీపీ సభలో జగన్ ఎదురుగా ఓ వైసీపీ కార్యకర్త మాట్లాడుతూ..‘‘తప్పుడు నా కొడుకులు..చంద్రబాబుకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు అన్నా..’’ అంటూ పెద్దాచిన్నా అనే గౌరవం లేకుండా మాట్లాడితే ఆ కార్యకర్తను వారించక జగన్ పైశాచికంగా నవ్వుతూ ఎంజాయ్ చేశారు.

ఈ రెండు వీడియోలను చూసిన జనాలు నాయకుడికి, సంస్కార హీనుడికి ఇదే తేడా అని కామెంట్ చేస్తున్నారు. రాజకీయాల్లో ఎవరు ఏంటో అనేది దీని ద్వారానే అర్థమవుతుంది. ఒక్కచాన్స్ అంటూ వచ్చి వ్యవస్థలను భ్రష్టుపట్టించిన జగన్ కు, ఏపీ అభివృద్ధికి ఇప్పటికీ ఆహర్నిషలు కష్టపడుతున్న చంద్రబాబుకు ఉన్న డిఫరెన్స్ ఇదేనంటున్నారు. ఇప్పటికైనా ఏపీ జనాలు ఆలోచించుకోవాలి. ఎవరి చేతిలో మన భవిత భద్రంగా ఉంటుందో ఆ నాయకుడినే ఎన్నుకోవాలి. అది ఒక్క చంద్రబాబు ద్వారానే సాధ్యమవుతుందని తెలుసుకోవాలి.

Exit mobile version