Anasuya Comments : ఇది కదా నిజమైన ప్రేమంటే.. ఇది ఆరంభం మాత్రమే.. పవన్ గెలుపుపై అనసూయ కామెంట్స్

Anasuya Comments
Anasuya comments on Pawan : పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఫ్యాన్స్ తో పాటు మెగా కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగిపోయారు. పవన్ కల్యాణ్ పిఠాపురంలో 70 వేల మెజార్టీతో గెలవగానే తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులు అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. పవన్ గెలిచిన తర్వాత నేరుగా ఢిల్లీ వెళ్లి ఎన్డీఏకు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పి అక్కడి మీటింగ్ లో పాల్గొని హైదరాబాద్ వచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులను కలిసేందుకు వచ్చిన పవన్ కు గ్రాండ్ వెల్ కమ్ లభించింది. చిరు ఫ్యామిలీ అంజనా దేవి, రాం చరణ్ దంపతులు, వరుణ్ తేజ్ దంపతులు, సాయి ధరమ్ తేజ్, పవన్ అక్కా, చెల్లెళ్లు, నిహారిక, లావణ్య త్రిపాఠి ఇలా అందరూ పండగ చేసుకున్నారు. పవన్ కు భారీ పూల మాల వేసి చిరు ఆనందంతో పవన్ ను కౌగిలించుకున్నాడు.
అయితే ఈ విజయంపై పవన్ అభిమానులతో పాటు సెలబ్రేటీలు స్పందిస్తున్నారు. పవన్ సెలెబ్రేట్ వీడియోపై నటి అనసూయ స్పందించింది. నిజాయతీ గల ప్రేమ ఇలానే ఉంటుంది. మెగాస్టార్, పవర్ స్టార్ లను ఇలా చూస్తుంటే ఎంతో చక్కగా ఉంది. రెండు కళ్లు చాలడం లేదు. పవన్ గెలుపు కేవలం ఆరంభం మాత్రమే ఇంకా చాలా ఉందంటూ సపోర్టుగా పోస్టు చేసింది.
దీంతో అనసూయ కామెంట్లు వైరల్ గా మారాయి. జబర్దస్త్ లో మానేసిన అనసూయ ప్రస్తుతం సినిమాల్లో బిజి బిజీ అయిపోయింది. ప్రజెంట్ పుష్ప 2 సినిమాలో చేస్తుంది. పవన్ గెలుపు సంబరాల్లో పవన్ కుటుంబ సభ్యులందరినీ చూసి తెలుగు రాష్ట్రాలు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. మెగా కుటుంబం ఇలా అందరూ ఒక్క చోట కలవడంపై సంతోషపడుతున్నారు. అనసూయ గతంలో పవన్ కు సపోర్టుగా ప్రచారం చేస్తారని వార్తలు వినిపించినా.. చివరి క్షణంలో ఆమె ప్రచారం చేయడానికి వెళ్లలేదని తెలిసింది. అయినా పవన్ గెలుపును ఆమె కూడా ఎంజాయ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో చేసిన పోస్టుతో అర్థమయితుంది.