CBI Update : ‘జగన్ కేసులపై అందుకే ఆలస్యమవుతోంది’..సుప్రీంకు సీబీఐ అప్ డేట్
CBI Update : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ పై 2011లో అక్రమాస్తుల కేసుల దర్యాప్తులో రెండేళ్లలో పూర్తి చేసిన సీబీఐ 2013లో హైదరాబాద్ లో చార్జీషీటు దాఖలు చేసింది. అప్పటి నుంచి కేసు పురోగతి కనిపించడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఈనేపథ్యంలో వైసీపీ ఎంపీ రఘురామ క్రిష్ణ రాజు దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో మళ్లీ కదలిక వచ్చింది.
తాజా పరిస్థితిపై సుప్రీంకోర్టుకు సీబీఐ అప్ డేట్స్ ఇచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జీషీటుపై విచారణ ఎందుకు ఆలస్యమవుతోంది… 2013లో సీబీఐ ఇచ్చిన ఆధారాలపై కేసు ముందుకు ఎందుకు వెళ్లడం లేదు… నిందితులు ఏకంగా 39 క్యాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేసినట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది.
ఈ కేసులో జడ్జిలు కూడా బదిలీ అయిపోతున్నారు. అందుకే కేసు బలంగా ముందుకు వెళ్లడం లేదు. చివరి న్యాయవాది కనీసం రెండేళ్లు కూడా ఉండకుండానే బదిలీ అయ్యారని సీబీఐ తెలిపింది. నిందితులు ఏదో ఒక విధంగా పిటిషన్లు విచారణకు పోకుండా చేస్తున్నారని చెబుతోంది. కేసును ఇతర రాష్ట్రాలకు బదిలీ చేస్తే సాక్ష్యులకు ఇబ్బందులు తప్పవని కోర్టుకు సీబీఐ వెల్లడించింది.
జగన్ అక్రమాస్తుల కేసులో మొత్తం 911 మంది సాక్ష్యులున్నారని సూచించింది. వారంతా 50 ఏళ్ల పైబడిన వారే. కేసును ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తే సమస్యలు ఎదురు కావచ్చు. అందుకే ఇక్కడే కేసు విచారణ కొనసాగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీబీఐ పేర్కొంది. ఇలా జగన్ అక్రమాస్తుల కేసు ఏళ్లుగా పెండింగ్ లోనే ఉండిపోతోంది.
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా. ముఖ్యమంత్రి కావడంతో కేసు పురోగతి లేకుండా చేసేందుకు అన్ని మార్గాలు వాడుతున్నారు. అందుకే ఇన్నాళ్లుగా కేసు కొలిక్కి రావడం లేదు. కేసు ముందుకు వెళితే జగన్ కు కచ్చితంగా శిక్ష పడటం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.