Prabhas : ప్రభాస్ కు అందుకే పెళ్లి కాలేదు.. వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు
Prabhas-Venu Swamy : టాలీవుడ్ నుంచి పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిన తొలి హీరో ప్రభాస్. బహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మాములుగా పెరగలేదు. అంతకుముందు ఓ హిట్, ఓ ప్లాప్ అన్నట్టుగా ఉండే ప్రభాస్ కెరీర్ బహుబలికి ముందు, బహుబలికి తర్వాత అన్నట్టుగా మారిపోయింది. బహుబలి తర్వాత ఫ్యాన్స్ లో ప్రభాస్ సినిమా అంటే అంచనాలు భారీగా ఉండేవి. అందుకే ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఏవీ పెద్దగా హిట్ కాలేదు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నా మిగతా ఆడియన్స్ ను అంతగా ఆకట్టుకోలేదు. ఇటీవల వచ్చిన ‘సలార్’ మూవీతో ప్రభాస్ మళ్లీ హిట్ ట్రాక్ అందుకున్నాడు. సలార్ 700 కోట్లకు పైగా వసూలు చేసి ఇదీ ప్రభాస్ రేంజ్ అన్నట్టుగా రికార్డులు సెట్ చేసి పెట్టింది.
తాజాగా ప్రభాస్ జాతకంపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దేశవ్యాప్తంగా పాన్ ఇండియన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న ప్రభాస్ జాతకం ఆ మధ్య హాట్ టాపిక్ అయిపోయింది. దీనికి కారణం ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ప్రభాస్ జాతకంలో లోపాలు ఉన్నాయని, సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్ లో ఇబ్బందులు వస్తాయని చెప్తుండడమే. ఇప్పుడు మరోసారి ఆయన ప్రభాస్ పెళ్లి, సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..తాను పదమూడేళ్ల వయస్సులో సినిమా ఇండస్ట్రీకి వచ్చానని చెప్పారు. రెబల్ స్టార్ కృష్ణంరాజుతో తనకు పరిచయం ఏర్పడిందన్నారు. వాళ్ల ఫ్యామిలీలోని అందరి జాతకాలు తనకు బాగా తెలుసన్నారు. ప్రభాస్ ఫస్ట్ మూవీ ఈశ్వర్ ఎలా చేశాడో కూడా తనకు తెలుసన్నారు. ఊరికే సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ తనను ట్రోల్ చేస్తారని చెప్పుకొచ్చారు. కానీ ప్రభాస్ గురించి తనకు తెలిసినంత ఎవరికీ తెలియదన్నారు.
ఇక ప్రభాస్ పెళ్లి విషయం గురించి చెబుతూ ప్రభాస్ కు పెళ్లి వయస్సు ఎప్పుడో వచ్చేసిందని, మరి ఇప్పటి వరకూ ఆయనకు పెళ్లి ఎందుకు జరుగలేదో కూడా తనకు తెలుసన్నారు. ప్రభాస్ జాతకంలో సమస్యలు ఉన్నాయని, అందుకే ఇలా జరుగుతున్నాయని వేణు స్వామి వెల్లడించారు.