AP Deputy CM Pawan Kalyan : తొలిసారి చట్టసభలకు ఎన్నికైన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాన్ పాలనలోనూ తనదైన మార్క్ చూపిస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక అనంతరం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి తిరిగి వచ్చారు పవన్ కల్యాణ్. అప్పటికే తనను కలిసేందుకు ఎదురుచూస్తున్న ప్రజలను డిప్యూటీ సీఎం గమనించారు. వెంటనే తన కాన్వాయ్ ఆపారు. తన సిబ్బందిని పురమాయించి అక్కడికే కుర్చీలు తెప్పించుకొని కూర్చున్నార. బాధితులను తన పక్కన కూర్చొబెట్టుకొని అర్జీలు తీసుకున్నారు. వారి సమస్యలేంటో వివరంగా తెలుసుకున్నారు.
ప్రశ్నించడమే కాదు.. పరిష్కారం తెలిసిన నాయకుడు
జనసేన అధినేతగా పవన్ కల్యాణ్ గత ప్రభుత్వంపై పోరాడాడు. ప్రజా సమస్యలపై వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కౌలు రైతుల కోసం అధికారంలో ఉన్న వాళ్లు చేయలేని పనిని పవన్ కల్యాణ్ తన భుజాలకు ఎత్తుకున్నాడు. కౌలు రైతులను ఆదుకునేందుకు ముందుగా తాను సంపాదించిన దాంట్లోంచి కేటాయించాడు. ఇతరులకు ఆదర్శంగా నిలిచారు పవన్ కల్యాన్.
బాధితుల వద్దకే డిప్యూటీ సీఎం
జనసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ రాష్ట్రమంతా తిరిగి ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకున్నారు .ఉద్ధానం కిడ్నీ బాధితులు సహా రైతులు, మహిళలు, పేదల సమస్యలను క్షేత్రస్థాయికి వెళ్లి ప్రత్యక్షంగా చూశార. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల సమస్యలు చూసి చలించిపోయారు పవన్ కల్యాణ్.. ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని సంకల్పం తీసుకున్నారు. తాను అనుకున్న లక్ష్యం నెరవేర్చుకునేందుకు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను ఏరికోరి మరీ తీసుకున్నారు.
ఇప్పడు ఆ సమస్యల పరిష్కారానికి తన మార్క్ ‘పాలన’ మొదలుపెట్టారు. తాను చెప్పింది చేతల్లో చేసి చూపిస్తున్నాడని అటు అభిమానులు, ఇటు జనసైనికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతలు స్వీకరించి మొదటి రోజునే పవన్ కల్యాన్ తన శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలపై అధికారులను నిలదీశారు. పంచాయతీలు, స్థానిక సంస్థలకు కేటాయించిన నిధుల మళ్లింపుపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు, ఆర్ధిక సంఘం నిధులు సీఎఫ్ఎంఎస్కు ఎందుకు మళ్లించారని ప్రశ్నించారు. నిధులు ఏ మేరకు మళ్లించారో వెంటనే తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.