JAISW News Telugu

BJP : ఇది కదా బీజేపీ నుంచి కోరుకునేది!

BJP

BJP

BJP : ఏపీలో మరో వారం రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ప్రతిపక్షాలు తహతహలాడుతున్నాయి. వైసీపీని గద్దె దించాలని ఉన్న శక్తినంతా కూడగడుతున్నాయి. ఈ క్రమంలోనే 2014లో కూటమిగా మారిన టీడీపీ, బీజేపీ, జనసేనలు మరో సారి చేతులు కలిపాయి. అయితే ఈ కూటమిలో పైకి బాగానే ఉన్నప్పటికీ లోలోపల మాత్రం బీజేపీ ఎందుకో అంతగా యాక్టివ్ గా లేనట్టు కనిపిస్తోంది. 2014లో ఏకతాటిపై ఉండి కూటమి విజయం సాధించింది. కానీ 2019 నాటికి సీన్ మారింది. మూడు పార్టీలూ తమ దారులు వెతుక్కున్నాయి. దాంతో వైసీపీ లాభపడింది. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్లీ మూడు పార్టీలు జతకట్టినా, 2019లో చేసిన పొరపాట్లు ఇప్పుడు  చేయవద్దని సగటు పౌరుడు కోరుకుంటున్నాడు.

కాగా, కమలం పెద్దలకు మాత్రం ఈ పొత్తు ఇష్టం లేదన్న ప్రచారం జరుగుతోంది. పవన్ కోసం ఈ పొత్తుకు సిద్ధపడ్డారే తప్ప.. టీడీపీ పై బీజేపీ పెద్దలకు మాత్రం ఆసక్తి లేదని తెలుస్తోంది. ఇలాగైతే ఒక శాతం ఓటు బ్యాంకు ఉన్న బీజేపీకి 40 శాతం ఓటు బ్యాంకు ఉన్న టీడీపీ ఓట్లు ట్రాన్స్ ఫర్ అవుతాయా అనే అనుమానాలు అందరిలో ఉండేవి. అయితే ఎన్నికల సమీపిస్తున్న సమయంలో ఈ అనుమానాలకు మోదీ చెక్ పెట్టారు.

మొన్న జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ వైసీపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మద్యం మాఫియా, ఇసుక మాఫియా, ఒక్క పని సరిగ్గా చేయలేదని,  అభివృద్ధి కుంటుపడిందని, పోలవరం చేయలేకపోయారని, దేవాలయాలను రక్షించలేకపోయారని..ఇలా పలు అంశాలపై మోదీ విమర్శించారు. వైసీపీతో బీజేపీ అంతర్గత దోస్తీ లేదు అని శ్రేణులకు మోదీ చెప్పకనే చెప్పారు. అలాగే డీజీపీ బదిలీ, ఇతర అధికారుల బదిలీ, సంక్షేమ పథకాల ఫండ్స్ ను విడుదల చేయకపోవడం వంటివన్నీ టీడీపీ శ్రేణులు సంతృప్తి పరుస్తున్నాయి. కూటమిలో బీజేపీ యాక్టివ్ కావాలనే వారు కోరుకున్నారు. మోదీ తన ప్రసంగంతో  టీడీపీ శ్రేణులకు భరోసా లభించింది. దీంతో రాబోయే ఎన్నికల్లో ఓట్ల బదిలీ సక్రమంగానే జరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

Exit mobile version