Viral video : ఇలా వేటాడాలి రా కన్నా..పిల్లలకు వేట నేర్పుతున్న మృగరాజు.. వైరల్ వీడియో

Viral video

Viral video

Viral video : దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్‌లో ఆరు సింహం పిల్లలు తమ తల్లితో కలిసి నడుస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ తెగ లైక్స్ కొట్టేస్తున్నారు. తన కళ్ల ముందు ఈ అసాధారణ దృశ్యాన్ని చూడటం తన అదృష్టమని లేటెస్ట్ సైటింగ్స్  సీఈవో నదవ్ ఒస్సెండ్రైవర్ అన్నారు. ఈ ఫుటేజీని లేటెస్ట్ సైటింగ్స్ వారి యూట్యూబ్ ఛానెల్‌లో మే 3న షేర్ చేసింది. వాస్తవానికి వేట అనేది అడవి జంతువుల నైజం. అడవిలో జీవించే ప్రతి జీవి తప్పనిసరిగా వేట నేర్చుకోవాల్సిందే. అది తమను తాము రక్షించుకోవటానికి, ఆహారం సంపాదించుకోవటానికి తప్పని విద్య. అందుకే చాలా జంతువులు దీన్ని దృష్టిలో ఉంచుకుని తమ పిల్లలకు సరైన ట్రైనింగ్ ఇస్తుంటాయి. ఇలాంటి విషయాలకు సంబంధించిన వీడియోలు కూడా అనేకం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  తాజాగా అలాంటి వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక సింహం తన పిల్లలతో అడవిలో రోడ్డుపై తిరుగుతూ కనిపిస్తుంది.

వైరల్ అయిన యూట్యూబ్ వీడియోలో అడవీ మార్గంలో కొన్ని కార్లు ఆగి ఉండడం చూడొచ్చు. ఆ సమయంలో రోడ్డుకు అడ్డంగా రెండు పెద్ద సింహాలు, నాలుగు సింహం పిల్లలతో కలిసి రోడ్డు దాటుతూ కనిపిస్తున్నాయి. అడవి లోపల నుంచి ఒక్కొక్కటిగా నాలుగు సింహం పిల్లలు బయటకు వస్తుంటాయి. ఒక సింహం దాని పిల్లలకు శిక్షణ ఇచ్చేందుకు వాటిని ఇలా రోడ్డుపైకి తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ సీన్. తల్లి సింహం ముందుకు నడుస్తూ వెళ్తుండగా,.. దాని పిల్లలు మెల్లమెల్లగా తల్లిని అనుసరిస్తున్నాయి. అడవి జంతువుల నుండి తమ పిల్లలను రక్షించుకోవడానికి సింహాలు తమ పిల్లలకు బహిరంగంగా శిక్షణ ఇస్తున్నట్టుగా వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. తల్లిదండ్రులు ముందుకు నడవడం, సింహం పిల్లలు నెమ్మదిగా వారి వెనుక వెంబడించడం కనిపిస్తుంది. సుమారు ఒక గంట పాటు తన పిల్లలకు ఇలా ట్రైనింగ్ ఇచ్చింది ఆ సింహం. ఈ దృశ్యాన్ని చూసిన అతను తన అనుభవాలను కామెంట్ల రూపంలో పంచుకున్నారు.  ప్రస్తుతం వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

TAGS