Lal Salaam : ‘లాల్ సలామ్’ ట్విటర్ టాక్ ఇదే..రజినీ కూతురు డైరెక్షన్ ఎలా ఉందంటే..
Lal Salaam : సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ‘లాల్ సలామ్’ మూవీని తెరకెక్కించారు. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రజినీకాంత్ ఓ ముఖ్య పాత్ర పోషించారు. అలాగే కపిల్ దేవ్, జీవిత రాజశేఖర్ కూడా ఇందులో నటించారు. లైకా ప్రోడక్షన్స్ నిర్మాణంలో రూపొందిన ఈ మూవీ తమిళ, తెలుగు భాషల్లో నేడు రిలీజ్ అయ్యింది. ఈ సినిమా చూసిన ఆడియన్స్ ఏమంటున్నారో? ట్విటర్ లో వారు ఎలా స్పందిస్తున్నారో చూద్దాం..
పూర్తి ఎమోషనల్ స్టోరీతో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా సినిమా ఉందట. అయితే ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించే సీన్స్ పెద్దగా లేవట. ముఖ్యంగా సౌత్ అండ్ రూరల్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా మూవీ ఉందని అంటున్నారు.
మూవీ ఫస్టాఫ్ లో రజినీకాంత్ 20 నిమిషాలు మాత్రమే కనిపిస్తారట. ఇక ముస్లింగా రజినీ గెటప్ చాలా బాగుందట. ఐశ్వర్య దర్శకత్వం మాత్రం డైరెక్టర్ వెట్రిమారన్ స్టైల్ లో ఉందట. మొత్తానికి ఒక మంచి సోషల్ మెసేజ్ మూవీ అని అంటున్నారు.
ఐశ్వర్య ఒక సీరియస్ సబ్జెక్ట్ ను తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సీన్ తర్వాత సీన్ చాలా ఇంట్రెస్టింగ్ గానే తీశారట. కానీ ఎడిటింగ్ మూవీకి మైనస్ అయ్యిందని చెబుతున్నారు. రజినీ అభిమానులను కాకుండా సీరియస్ అండ్ మెసేజ్ ఒరియంటెడ్ మూవీస్ ను ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుందని చెబుతున్నారు. మొత్తానికి ఈ సినిమా ఎబో యావరేజ్ గా ఉందంటున్నారు.
1st Half done – Block Buster ✅ @ash_rajinikanth adapted Vetrimaaran style of film-making ; directed Ther Tiruvizha episode beautifully ❤️🔥🙏
Hardly 20mins screen-space for @rajinikanth In entire 1st half. #LalSalaamFDFS #Thalaivar #SuperstarRajinikanth #LalSalaam pic.twitter.com/kZQD4vkt9M
— 𝐀𝐥𝐥𝐚𝐫𝐢 𝐑𝐚𝐦𝐮𝐝𝐮 𝐍𝐓𝐑 (@AllariRamuduNTR) February 9, 2024