Game Changer : రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కథ ఇదే..

Game Changer

Game Changer

Game Changer : తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్- రామ్ చరణ్ కాంబోలో వస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. దీని కోసం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తుంది టాలీవుడ్ ఇండస్ట్రీ. ప్రస్తుతం షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. కొన్ని రోజుల్లోనే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు.

సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఓటీటీ హక్కులను అమేజార్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. ఈ మేరకు అధికారికంగా కూడా ప్రకటించింది. అయితే, కథ గురించి కూడా పాపులర్ ప్లాట్ ఫారం రిలీజ్ చేసింది. ఇది ప్రచారానికి మరింత బాగా కలిసి వచ్చే అంశం.

‘గేమ్ ఛేంజర్’ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు మంగళవారం ప్రకటించింది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో అధికారికంగా ప్రకటించింది. 2024లో విడుదల కోసం గ్రాండ్ లైనప్‌ను ఆవిష్కరించింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ తర్వాత అమేజాన్ లో అందుబాటులోకి వస్తుంది.

‘గేమ్ ఛేంజర్’ అనేది ఒక నిజాయితీగల IAS అధికారి కథ. అతను రాజకీయ అవినీతిపై పోరాడుతాడు. న్యాయంగా ఎన్నికలు నిర్వహించడంలో అతని పాత్ర గురించి కథ సాగుతుంది. ‘గేమ్ ఛేంజర్’ కథను కార్తీక్ సుబ్బరాజ్ అందించగా, దర్శకుడు శంకర్ స్క్రీన్ ప్లేపై పని చేశారు.

గేమ్ ఛేంజర్ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా తెరపైకి రానుంది. అయితే, దీనిపై త్వరలో అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం, వైగాజ్‌లోని షూటింగ్ స్పాట్ నుంచి కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. రామ్ చరణ్ ఫార్మల్ షర్ట్, ప్యాంటు ధరించి కనిపించాడు. కథానాయికగా కియారా అద్వానీ కాటన్ చీరలో కనిపించింది. ఈ షెడ్యూల్ తరువాత, తదుపరి షెడ్యూల్ మార్చి 21 నుంచి హైదరాబాద్‌లో జరగనుంది.

TAGS