Karimnagar : కరీంనగర్ లోక్ సభ స్థానం ప్రత్యేకత ఇదీ..

Karimnagar

Karimnagar

Karimnagar : కరీంనగర్ ఉత్తర తెలంగాణ కేంద్రం. తెలంగాణలో ఈ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో మిగతా తెలంగాణ జిల్లాలు కరువు కటాకాలతో ఇబ్బందులు పడుతుంటే కరీంనగర్ జిల్లా మాత్రం పంటల్లో కోస్తా జిల్లాలతో పోటీ పడేది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన కరీంనగర్ జిల్లా రాజకీయంగా ప్రాధాన్యమున్న జిల్లా. దక్షిణాది నుంచి తొలి ప్రధానిగా పనిచేసిన పీవీ నరసింహరావు సొంత జిల్లా ఇది. అలాగే బాలీవుడ్ లో రారాజుగా వెలుగొందిన పైడి రాజు పుట్టిన జిల్లా ఇది. అలాగే ఎందరో సినీ దర్శకులను, రచయితలను, నటులను అందించిన జిల్లా. అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్న ఈ జిల్లా రాజకీయంగా చాలా ప్రాధాన్యమున్న జిల్లా. టీఆర్ఎస్ కు ఊపిరిలూదిన జిల్లా ఇది. తెలంగాణ ఉద్యమాన్ని దేశ స్థాయిలో వినపడేలా చేసిన జిల్లా..ఇలా ఎన్నెన్నో ఘనతలు కరీంనగర్ సొంతం.

కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లు గతంలో ఒకే జిల్లా పరిధిలో ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల పునర్విభజనలో ఎంపీ స్థానం ఐదు జిల్లాలకు విస్తరించడం గమనార్హం. మొత్తం ఏడింటిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు 3 జిల్లాల్లోకి వెళ్లిపోయాయి. రెండు సెగ్మెంట్లు రెండేసి జిల్లాల్లో ఉండగా, మిగతా రెండు ఒకే జిల్లా పరిధిలో ఉన్నాయి. గతంలో పార్టీల పరంగా ఒకే జిల్లా అధ్యక్షుడు ఉండేవారు. ప్రస్తుతం ఐదుగురు ఉండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు వారందరినీ సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇదిలా ఉండగా హుస్నాబాద్, బెజ్జంకి మండలాలను కరీంనగర్ జిల్లా పరిధిలోకి తేవాలన్న అంశం శాసనసభ ఎన్నికల సమయంలో తెరపైకి వచ్చింది. ఈమేరకు శాసనసభ్యులు హామీ ఇచ్చారు. ఇంతవరకు ఆ హామీ అయితే నెరవేరలేదు.

అసెంబ్లీ నియోజకవర్గాలు ఏ జిల్లాల్లో ఉన్నాయి..

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా

వేములవాడ: జగిత్యాల, రాజన్న సిరిసిల్ల

చొప్పదండి : కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల

కరీంనగర్ : కరీంనగర్

హుజూరాబాద్ : కరీంనగర్, హన్మకొండ

మానకొండూరు: కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట

హుస్నాబాద్ : సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ

TAGS