slowest train in India : ఇండియన్ రైల్వే ప్రస్తుతం బాగా డెవలప్ అయ్యిందని తెలిసిందే కదా.. వందే భారత్ లాంటి సూపర్ స్పీడ్, సౌకర్యవంతమైన రైళ్లు వచ్చేశాయి. ఇంకా ఫాస్టెస్ట్ రైళ్లు కూడా వచ్చాయి. కానీ ఇప్పటికీ ఒక రైలు మాత్రం అత్యంత స్లోగా నడుస్తుంది. 1910 కిలో మీటర్ల ప్రయాణానికి 37 గంటలు పడుతుంది. గరిష్టంగా 111 స్టేషన్లలో ఆగుతుంది. అయినా కూడా ఈ రైలు ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. ఆ రైలే హౌరా టు అమృత్ సర్ మెయిల్. దేశంలోని అతి ఎక్కువ మలుపుల గుండా ఈ రైలు ప్రయాణం కొనసాగిస్తుంది. దీంతో పాటు ఎడారి, పర్వతాల నుంచి ప్రయాణం చేస్తుంది. దేశంలో అత్యధిక స్టాపులు కలిగిన రైలు కూడా ఇదే. ఇది పశ్చిమ బెంగాల్‌లోని హౌరా నుంచి రాత్రి 7.15 గంటలకు బయల్దేరి మూడో రోజు ఉదయం 8.40 గంటలకు చేరుకుంటుంది. ఇదే ట్రైన్ అమృత్ సర్ లో సాయంత్రం 6.25 గంటలకు బయల్దేరి మూడో రోజు ఉదయం 7.30 గంటలకు హౌరా చేరుతుంది. టికెట్ ధర కూడా తక్కువగానే ఉంటుంది. రూ. స్లీపర్ క్లాస్ కోసం రూ. 695, థర్డ్ ఏసీకి రూ. 1,870, రూ. సెకండ్ ఏసీకి 2,755, రూ. ఫస్ట్ ఏసీకి 4,835 ఉంటుంది.