Rajamouli : ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా వెలుగొందుతున్నాడు. రాజమౌళి తీసిన బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ మూవీలో పాన్ ఇండియా లెవల్లో గ్రేట్ మూవీలుగా నిలిచిపోయాయి. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ అవార్డు కూడా లభించింది. కానీ రాజమౌళికి తెలుగు డైరెక్టర్ సుకుమార్ అంటే ఒకప్పుడు ద్వేషం ఉండేదంటా.. నిజంగా ఉండే ద్వేషం కాదు.
ఆయనలా నేను ఎందుకు ఆలోచించలేకపోతున్నాను. ఇది సరికాదు కదా అనుకుంటూ తెగ బాధపడిపోయేవారట. వన్ నేనొక్కడినే చిత్రంలో మహేశ్ బాబు తో తీసిన టీజర్ షాట్ జీవితంలో అస్సలు మరిచిపోలేను. చాలా మందికి ఆ షాట్ అర్థం కాదు. కానీ డైరెక్టర్ గా అలాంటి ఆలోచన నేను ఎందుకు చేయలేక పోయాను అని బాధపడుతుంటా.. అందుకే సుకుమార్ అంటే ద్వేషం పోయి ప్రేమించడం మొదలుపెట్టా.
సుకుమార్ ఆర్య సినిమా తీసినపుడు నిజంగానే ద్వేషం కలిగింది. కానీ ద్వేషించడం మానేసి ప్రేమిస్తే ఇంకా ఎన్నో నేర్చుకోవచ్చు కదా అనుకున్నాను. మహేశ్ బాబుతో వన్ సినిమా తీసినపుడు సుకుమార్ షాట్ అనేది ఎక్ట్సర్డినరీ మాటల్లో వర్ణించలేనిది. అది నన్నెప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి డైరెక్టర్ గా ఇతర దర్శకుల నుంచి నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటా..
ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్ బాబు తో సినిమా తెరకెక్కిస్తున్నారు. దీని గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ లేదు. ఏయే నటులు ఉన్నారు. సినిమా లో హిరోయిన్ ఎవరూ అనే అంశాలు ఇంకా బయటకు రాలేదు. ఆగస్టు 9న మహేశ్ బాబు బర్త్ డే రోజు ఉంది. ఆ సమయంలో సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయి బయటకు కొన్ని వివరాలైన వస్తాయని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రాజమౌళి మాట్లాడిన తీరుపై చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఒక డైరెక్టర్ కు ఉండాల్సిన లక్షణం నేర్చుకోవడం ఇది జక్కన్న వద్ద ఇబ్బడి ముబ్బడిగా ఉందని మరో డైరెక్టర్ ను పొగడటం అంటే మామూలు విషయం కాదని చెబుతున్నారు.