JAISW News Telugu

Samantha : సమంత అందం వెనుక రహస్య ఇదేనట

Samantha

Samantha

Samantha : తన అందం, అభినయంతో తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది టాప్ హీరోయిన్ సమంత. కెరీర్ ప్రారంభంలో కాస్త గ్లామర్ పాత్రలతో రాణించిన సమంత  ఆ తరువాత నటనకు స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకుంది. ఆయా పాత్రలను తనదైన శైలి నటనతో మెప్పించి ప్రేక్షకులను మెప్పించింది. నటిగా రంగస్థలం, మజిలీ, ఓ బేబీ సినిమాలు సమంతకు మరింత పేరు తెచ్చిపెట్టాయి.ఇక నాగచైతన్య ని ప్రేమించి పెళ్ళి చేసుకున్న సమంత ఆ తర్వాత  విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్న విషయం తెలిసిందే.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే సమంత అభిమానులతోనూ  టచ్ లో ఉంటుంది.  తనకు నచ్చిన ఫోటోలు, వీడియో లను తన సోషల్ మీడియా అకౌంట్లలో పంచుకుంటుంది. సమంతా తమ ఫామ్ హౌస్ లో టెర్రస్ పైన కూరగాయలు పండిస్తారనే విషయం తెలిసిందే. ఇక సమంత తన అందం వెనకున్న రహస్యాన్ని పలు సందర్భాల్లో వెల్లడించింది. పలు వీడియో ల్లో తను  పాటించే బ్యూటీ టిప్స్ అందరికి చెప్పిన విషయం తెలిసిందే.

సమంత గ్లామర్ వెనుక ప్రధానమైనది ఫేస్ మసాజర్‌. ముఖాన్ని కాసేపు అలా మసాజ్ చేసుకుంటే ఎంతో మృదువుగా ఉండడంతోపాటు కాంతివంతంగా మెరుస్తుందని చెబుతున్నది ఈ బ్యూటీ. ఇదే తన బ్యూటీ సీక్రెట్ అంటున్నది. ఇక సమంత ఎక్కువగా ఫిట్ నెస్ కు చాలా ప్రాధాన్యం ఇస్తుంటుంది. ఎంత ఒత్తిడిలో ఉన్నా, బిజీ షెడ్యూల్ అయినా సరే కచ్చితంగా వ్యాయామం చేస్తుంది. అలాగే కచ్చితమైన డైట్ ఫాలో అవుతుంది. ఇక మానసిక ప్రశాంతతకు ధ్యానం చేస్తుంటుంది. కొద్ది రోజుల క్రితం మయోసైటిస్ గురైన సమంత ఇటీవల కోలుకుంది. మళ్లీ సినిమాల బాట పట్టింది.

Exit mobile version