YCP Incharges : వైసీపీ మరో 27 మంది నియోజకవర్గ ఇన్ చార్జుల జాబితాను విడుదల చేసింది. మొదటి జాబితాలో 11మందికి అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అంతటా వ్యతిరేక పవనాలు వీస్తున్నట్టు అంచనా వేసిన వైసీపీ అధినేత.. ఆ నెపం ఎమ్మెల్యేలపై వేయడానికి సిద్ధమయ్యారు. ఈక్రమంలో అభ్యర్థుల మార్పులు, చేర్పులు చేశారు. మంత్రులను ఎంపీలుగా, ఎంపీలను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలను ఎంపీలుగా మార్చారు. ఇప్పటి వరకూ 38 మంది సమన్వయ కర్తల స్థానాల్లో మార్పులు చేశారు.
వీటిలో కొసమెరుపు ఏంటంటే.. పవన్ పై ఎప్పుడూ విరుచుకుపడే గుడివాడ అమర్నాధ్ అనకాపల్లిలో అవకాశం
ఇవ్వలేదు. ఆయనకు ఎక్కడ సీటు ఇస్తారో చెప్పకుండానే వదలిశారు. అక్కడి నుంచి భరత్ కుమార్ కు అవకాశం ఇచ్చారు. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, కాకినాడ ఎంపీ వంగా గీతలను అసెంబ్లీకి పంపనున్నారు. ఇలా మొత్తం జాబితా అంతా మార్పులు చేర్పులే ఉన్నాయి. కొత్త నియోజకవర్గ ఇన్ చార్జుల జాబితా..
లోక్ సభ..
అరకు(ఎస్టీ): కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి
అనంతపురం: మాలగుండ్ల శంకరనారాయణ
హిందూపురం: జోలదరాశి శాంత
అసెంబ్లీ నియోజకవర్గం..
రాజాం(ఎస్సీ) : డాక్టర్ తాలె రాజేశ్
అనకాపల్లి : మలసాల భరత్ కుమార్
పాయకరావుపేట(ఎస్సీ): కంబాల జోగులు
రామచంద్రాపురం: పిల్లి సూర్యప్రకాశ్
పి.గన్నవరం(ఎస్సీ) : విప్పర్తి వేణుగోపాల్
పిఠాపురం: వంగా గీత
జగ్గంపేట : తోట నరసింహం
ప్రత్తిపాడు : వరుపుల సుబ్బారావు
రాజమండ్రి సిటీ : మార్గాని భరత్
రాజమండ్రి రూరల్ : చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
పోలవరం(ఎస్టీ): తెల్లం రాజ్యలక్ష్మి
కదిరి : బీఎస్ మక్బూల్ అహ్మద్
ఎర్రగొండ పాలెం(ఎస్సీ): తాటిపర్తి చంద్రశేఖర్
ఎమ్మిగనూర్: మాచాని వెంకటేశ్
తిరుపతి : భూమన అభినయ్ రెడ్డి
గుంటూరు ఈస్ట్ : షేక్ నూరి ఫాతిమా
మచిలీపట్నం: పేర్ని కృష్ణమూర్తి
చంద్రగిరి : చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
పెనుకొండ: కేవీ ఉషశ్రీచరణ్
కల్యాణదుర్గం: తలారి రంగయ్య
అరకు(ఎస్టీ): గొడ్డేటి మాధవి
పాడేరు(ఎస్టీ): మత్స్యరాస విశ్వేశ్వరరాజు
విజయవాడ సెంట్రల్: వెలంపల్లి శ్రీనివాస రావు
విజయవాడ వెస్ట్: షేక్ ఆసిఫ్