SJ Surya : ఖుషీ సినిమా డైరెక్టర్ ఎస్ జె సూర్య స్టార్ హీరో సినిమాల్లో డైరెక్టర్ గా నటిస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలు. ఎస్ జె సూర్య తెలుగులో తాజాగా సరిపోదా శనివారం సినిమాలో విలన్ గా నటించారు. ఈ సినిమాలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా యాక్ట్ చేశారు. నానికి ధీటుగా ఎస్ జె సూర్య నటించడంతో ప్రేక్షకులు ఆయన నటనకు ఫిదా అయ్యారు.
తమిళ ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడు ఎస్ జె సూర్య ఎన్నో పెద్ద సినిమాలకు డైరెక్షన్ చేశారు. మహేశ్ బాబు స్పైడర్ మూవీలో విలన్ గా నటించగా అప్పుడు ఆయన సృష్టించిన భయం అంతా ఇంతా కాదు. విలన్ అంటే ఇలా ఉండాలని నిరూపించారు. యాక్టింగ్ అంటే ఇది అని చూపించారు. విలనిజం చేయాలంటే ఒక డైరెక్టర్ కూడా చేయగలడని ఫ్రూవ్ చేశారు.
నాని రాబోయే రోజుల్లో మాస్ మూవీలు చేయనున్నాడని సమాచారం. శ్రీకాంత్ ఒదెల తో మరో మాస్ మూవీకి సైన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. నాని కూడా తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. క్లాస్, ఫ్యామిలీ మూవీలను కొన్నిరోజుల వరకు పక్కన బెట్టి మాస్ మూవీలను చేయాలని అనుకుంటున్నారు.
ఎస్ జే సూర్య కు భారీ బంపర్ ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద హీరోల మూవీల్లో విలన్ గా చేయమని డైరెక్టర్లు ఆఫర్లు ఇస్తున్నారని సమాచారం. రాబోయే రోజుల్లో ఎస్ జే సూర్య ఫర్మినెంట్ విలన్ గా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎస్ జే సూర్య విలనిజం డిఫరెంట్ మ్యానరిజంతో పోతుంది. కొన్ని కొన్నిసార్లు ఆయన నటన చూసి అందరికీ భయమేస్తుంది. అంతలా పాత్రలో లీనమై పోతారు. ఈయన నిజంగానే విలన్ క్యారెక్టర్ కోసమే పుట్టాడా అని అనిపిస్తుంది. మరి భవిష్యత్తుల్లో తెలుగులో మెయిన్ విలన్ క్యారెక్టర్లకు ఎస్ జే సూర్యనే సెటిల్ అయిపోతాడేమో చూడాలి.