Police Under YCP Rule : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉండేది. చదలవాడ ఉమేష్ చంద్ర పోలీసులకు ఆరాధ్యుడిగా ఉండేవారు. ఆయన చూపిన సామర్థ్యం చూసి అందరు ఆశ్చర్యపోయేవారు. ఆ సమయంలో పోలీసులు హీరోలుగా చెలామణి అయ్యేవారు. దీంతో ఆయనను పోలీసులు దేవుడిగా కొలిచేవారు. అప్పుడు పోలీసుల విధి నిర్వహణ కూడా కత్తి మీద సాములా ఉండేది.
కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. పోలీసులంటే చులకన భావం ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వారికి విలువ ఉండేది. ఉమేష్ చంద్ర నేరస్తుల పాలిట సింహస్వప్నమే. నక్సలైట్ల ఏరివేతలో కూడా ప్రత్యేక శైలి కలిగి ఉండేవాడు. అందుకే అప్పుడు అందరు ఉమేష్ చంద్రనే ఆదర్శంగా తీసుకునేవారు. హైదరాబాద్ నగరంలోనే నక్సలైట్లు కాల్చి చంపారు.
వైసీపీ పాలనలో పోలీసుల దుస్థితి ఎదురవుతోంది. విధి నిర్వహణలో హుందాగా ఉండే వారి డ్యూటీ ఇప్పుడు దారుణంగా తయారయింది. వారిని మురుగు కాలువలకు కాపలా ఉంచే స్థాయికి దిగజార్చింది. జగన్ పాలనలో వారికి అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు తమ విధుల పట్ల శ్రద్ధ చూపడం లేదు.
జగన్ ప్రభుత్వంలో అందరికి అయోమయ పరిస్థితులే నెలకొంటున్నాయి. పోలీసులను కాపలా వారిలాగా ఉంచడం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ క్రమంలో వారి విధి నిర్వహణ అంటే కత్తి మీద సాములా తయారయింది. పోలీసులంటే హుందాగా డ్యాటీ చేసే అవకాశాలున్నా ఇలాంటి ప్రాధాన్యం లేని విధులకు పురమాయించడం ప్రశ్నార్థకంగా మారింది.