Mahesh craze : మహేష్ క్రేజ్ అంటే ఇదే.. ప్లాప్ సినిమా 200 రోజులు ఆడింది
Mahesh craze : ఒకప్పుడు సినిమాలు వంద రోజులు, జూబ్లీ, సిల్వర్ జూబ్లీ అని గొప్పగా చెప్పుకునే వారు. ఇప్పుడు నాలుగు వారాలు థియేటర్లే కనిపిస్తే అదే పెద్ద రికార్డు. వంద, రెండు వందల రోజుల లెక్క మారింది. కేవలం వారాల్లోనే లెక్క తేల్చేస్తున్నారు. ఓటీటీల హవా పెరగడంతో థియేటర్లకు రిపీట్ ఆడియన్స్ వచ్చే అవకాశాలు లేకుండా పోయాయి. నిర్మాతలు సైతం ఎక్కువ స్క్రీన్లలో విడుదల చేసి భారీగా ఓపెనింగ్స్ రాబట్టుకుంటున్నారు. ఇప్పుడు 50 రోజులు ఆడితే రికార్డే.
ప్లాఫ్ సినిమా 200 రోజులు రన్..
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమా ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఈ సినిమా 200 రోజులు రన్ అయ్యింది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని వెంకటేశ్వర థియేటర్ లో రోజు నాలుగు ఆటలతో 200 రోజులు పూర్తి చేసుకోవడం గమనార్హం. కేవలం సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ కారణంగానే ఫ్లాప్ సినిమా థియేటర్ లో ఆడిందంటున్నారు. అయితే అది ఏ పాత సినిమా గురించో కాదు.. సంక్రాంతికి రిలీజైన గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా ఇది. తొలి రోజు నుంచే డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది ఈ సినిమా.
రూ. 180 కోట్ల గ్రాస్..
కేవలం సూపర్ స్టార్ మహేష్ బాబు ఇమేజ్ మీద ఈ సినిమా రూ.180 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి, బ్రేక్ ఈవెన్ తో బయటపడింది. సూపర్ స్టార్ పెర్ఫామెన్స్, శ్రీలీల డ్యాన్స్ అభిమానుల విపరీతంగా అకట్టుకున్నాయి. అయితే వాటిని మించి సినిమాలో ఏమీ లేదు. ఇక అభిమానులైతే త్రివిక్రమ్ పై మండిపడ్డారు. మహేష్ అభిమానుల ధాటికి తట్టుకోలేక ఇప్పటి దాకా ఎక్కడా కనిపించలేదు.