Lost Road on Earth : భూమిపై ఇదే లాస్ట్ రోడ్డు.. ఇక్కడ నేల నింగితో కలుస్తుంది.. ఈ ప్రపంచపు అంచు ఇక్కడ ఉంది తెలుసా..
Lost Road on Earth : ‘డెడ్ ఎండ్’ (తుదది) అనే పదం మనం వింటూనే ఉంటాం. అది గల్లీ కావచ్చు, వీధి కావచ్చు, గ్రామం కావచ్చు. వీటితో డెడ్ ఎండ్ అనేది ఏదో ఒకటి అడ్డుగా ఉంటుంది. మరో వీధి, మరో గ్రామం నుంచి ఆ డెడ్ ఎండ్ ముందు వరకు చేరుకొని గమ్యాన్ని కొనసాగించవ్చు. అయితే ఇక్కడ ఒకరోడ్డు డెడ్ ఎండ్ అంటే ఇక దాని ముందుకు వెళ్లేందుకు దారే లేదు.. అదే లాస్ట్..
మనం ఒక రోడ్డుపై వెళ్తుంటే గమ్యం ఇది అని ఊహించుకుంటాం.. ఆ రోడ్డు కూడా మనలను అక్కడికి తీసుకెళ్తుంది. అలాంటి రోడ్డు ముగిసిపోయిందని ఊహించుకుంటే చాలా ఎగ్జయిటింగ్ గా ఉంటుంది కదూ.. అక్కడ భూమి ఆకాశం కలిసిపోయినట్లు ఉంటుందట.. అలాంటి రోడ్డు గురించి తెలుుకుందాం.
ప్రపంచంలో లాస్ట్ రోడ్డు ఉండాలి.. ఆ దారి అనంతంలో కలిసిపోయావాలి.. అది ఎక్కడ ఉండాలి అనే దానిపై జియాలజిస్ట్ ఒక దేశాన్ని ఎంచుకున్నారు. ఇది ప్రపంచంలోని చివరి రోడ్డు (డెడ్ ఎండ్ రోడ్)గా నిర్ధారించారు. అదే ఐరోపాలోని ‘E-69 హైవే’ అని చెబుతున్నారు జియాలజిస్టులు.
‘E-69’ నార్వేలో ఉంది. ఇది వరల్డ్ లో లాస్ట్ రోడ్డు. దీంతో ఈ డెడ్ ఎండ్ రోడ్డును చూసేందుకు చాలా మంది ప్రజలు వస్తుంటారు.
ప్రపంచంలోని చివరి రోడ్డుపై ఒక్క సారైనా నడవాలని చాలా మంది కోరుకుంటారు. భూమిపై ఈ చివరి రహదారి ఉత్తరార్ధగోళంలో ఉంది. అంటే భూమధ్య రేఖకు ఎగువన అన్నమాట.
నార్వేలోని ‘E-69 హైవే’ ఉత్తర ధ్రువం దగ్గరికి వెళ్తుంది. ఈ రహదారి ఉత్తర ఐరోపాలోని నార్డ్ కాప్ను నార్వేలోని ఓల్డా ఫెవోర్డ్ గ్రామంతో అనుసంధానం చేస్తుంది. ఈ ‘E-69 హైవే’ దూరం 129 కి.మీ. 5 సొరంగాల గుండా రోడ్డు వెళ్తుంది.
వీటిలో పొడవైన సొరంగం ‘నార్త్ కేప్’. దీని పొడవు 6.9 కిలో మీటర్లు. సొరంగం సముద్ర మట్టానికి 212 మీటర్ల దిగువకు ఉంటుంది. దీన్నే లాస్ట్ రోడ్ అంటారు. ఆ దారిలో వెళ్లాలంటే కొన్ని నియామాలు పాటించాలి. ఈ రూల్స్ పాటించకుంటే ఆ దారిలో వెళ్లేందుకు అనుమతించరు. ‘E-69 హైవే’లో ఒంటరిగా వెళ్లేందుకు అనుమతి లేదు.
ఇక్కడ గాలి అత్యంత వేగంతో వీస్తుంది. చలి కూడా ఓ రేంజ్లో ఉంటుంది. వేసవిలో కూడా మంచు కురుస్తూనే ఉంటుందట. అప్పుడు కూడా చలి ఉంటుంది.
శీతాకాలంలో అయితే ఈ E-69 హైవే పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. భారీ హిమ పాతం, అప్పుడప్పుడు భారీ తుపానులు కూడా వస్తుంటాయి. ఇక్కడ ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా లేయలేరు. అందువల్ల ఒంటరిగా వెళ్లడం నిషేధించారట.
‘E-69 హైవే’ 1930లో ఐరోపాలోని నార్వేలో ఏర్పాటు చేయాలని ప్రణాళిక చేశారు శాస్త్రవేత్తలు. దానిని ఖరారు చేసేందుకు మరో నాలుగేళ్లు పట్టింది. 1934లో హైవే నిర్మాణం ప్రారంభమైంది. ఈ రోడ్డు నిర్మాణానికి 62 ఏళ్లు పట్టింది అంటే 1992లో పూర్తయిందన్నమాట. ఈ రహదారిని భూమిపై చివరిదని అంటారు. అనంతం వరకు వెళ్లే ఇలాంటి రోడ్లు ప్రపంచంలో చాలా ఉన్నాయని, కానీ వాటిని ఎవరూ గుర్తించలేదని, దీన్ని మాత్రం ప్రపంచం అధికారికంగా గుర్తించిందని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.