Salaar 2 : గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ప్రభాస్ ‘సలార్’ చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలను ఎదురుకుంటున్న ప్రభాస్ కి ఈ సినిమా ఇచ్చిన కిక్ మామూలుది కాదు. ప్రపంచవ్యాప్తంగా అన్నీ భాషలకు కలిపి ఈ సినిమాకి 620 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయిల మార్కుని అందుకుంటుంది అని అనుకున్నారు కానీ , సినిమా కథ అందరికీ పూర్తిగా అర్థం కాకపోవడం తో అనుకున్న రీచ్ ని చేరుకోలేదు. కానీ సినిమా అర్థం అయిన వారికి మాత్రం ‘సలార్’ చిత్రం ఒక డ్రగ్ లాగ ఎక్కేసింది. రెండవ భాగం ఎప్పుడెప్పుడు తెరకెక్కుతుందా, ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈ రెండవ భాగానికి సంబంధించిన స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారింది, ఇంతకీ ఆ స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం.
మొదటి భాగం లో కాన్సర్ రాజ్యం కోసం మూడు తెగలు కొట్టుకోవడం చూపించారు. అందులో ఒక తెగ కి సంబంధించిన వాడికి రాజ్యం ఎక్కడ కట్టబెడుతారో అనే భయం తో రాజ మన్నార్ ఆ తెగ మొత్తాన్ని సమూలంగా నాశనం చేస్తాడు. కానీ ఆ తెగలో సింహాసనం ఎక్కాల్సిన వ్యక్తి కొడుకు ఇంకా బ్రతికే ఉంటాడు, అతనే దేవా (ప్రభాస్) గా చూపిస్తాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ముందుగా ఈ సినిమాలో రాజమన్నార్ కొడుకు వరదరాజ మన్నార్ తో దేవా కి ఉన్న స్నేహ బంధం గురించి చాలా గొప్పగా చూపిస్తాడు. దేవా ని కాపాడడం కోసం వరదరాజ మన్నార్ భర్గత్ అనే పెద్ద రాజ్యం ని దేవా కోసం త్యాగం చేస్తాడు. దేవా వరదరాజ మన్నార్ కోసం ఏమి చెయ్యమన్నా చేస్తాడు. చివరికి తన ప్రాణం ఇవ్వమన్నా ఇచ్చేస్తాడు. కానీ దేవా చివర్లో కాన్సర్ రాజ్యం సింహాసనం ని అదీష్టించాడా?, లేకపోతే వరదరాజమన్నార్ కోరిక ప్రకారం త్యాగం చేశాడా అనేది సస్పెన్స్ గా పెట్టాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.
దీని గురించే రెండవ భాగం మొత్తం ఉండనుంది. దేవా అసలు తన తండ్రికి జరిగిన ప్రతీ కారం తీర్చుకోవడం కోసమే వరదరాజ మన్నార్ తో ఉద్దేశపూర్వకంగా స్నేహం పెంచుకున్నాడా..?, లేదా వరదరాజ మన్నార్ కి దేవా సత్తా ఏంటో తెలుసు కాబట్టి తనకి కాన్సర్ సింహాసనం దక్కాలనే కోరికని నెరవేర్చుకోవడానికి దేవా తో ఉద్దేశపూర్వకంగా స్నేహం పెంచుకున్నాడా?, ఇద్దరిలో ఎవరిదీ నిజమైన స్నేహం?, లేదా ఇద్దరూ ఉద్దేశపూర్వకంగానే ఒకరి లాభం కోసం ఒకరు స్నేహం పెంచుకున్నారా అనేది రెండవ భాగం లో చూపించబోతున్నారు.వాస్తవానికి వరదరాజ మన్నార్ కి దేవా కి ఉన్నంత సత్తా ఉంది, వంటి చేతితో వందమందిని మట్టుపెట్టగల సమర్థుడు. ఈ విషయం మనకి క్లైమాక్స్ లో తెలుస్తుంది. అంత సత్తా ఉన్నప్పటికీ కూడా ఎందుకు దేవా సహాయం కోసం అంత పరితపించారు అనేది కూడా రెండవ భాగం లో చూపించబోతున్నారు.