Foods : శృంగార కోర్కెలను పెంచే ఆహారం ఇదే!

Foods

Foods

Foods : శృంగారం సరైన వయస్సు వచ్చే వరకు దీని గురించి ఆలోచించడం భారత్ లో బహుషా నిషేధమనే చెప్పవచ్చు. కానీ కొన్ని ప్రాశ్చాత్య దేశాల్లో బాల్యం నుంచే శృంగారం గురించి అవగాహన కల్పిస్తారు. స్వయంగా స్కూల్స్ లోనే పాఠాల రూపంలో బోధనలు కూడా చేస్తుంటారు. భారత్ లో మాత్రం సెక్స్ ఎడ్యుకేషన్ అనేది పూర్తిగా వ్యతిరేకించే అంశం. దీనిపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి.. అవసరం అని కొందరు అంటే.. అవసరం లేదని కొందరు సనాతులు అంటుంటారు.

ఆరోగ్యాన్ని లైంగిక వాంఛను విడతీయలేము. ఆరోగ్యం బాగుంటే లైంగిక కోరికలు బాగుంటాయి. శృంగారంలో కూడా తృప్తి పొందుతారు. కొన్ని ఆహార నియమాలు పాటిస్తే కూడా లైంగిక ఆసక్తి పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

* సంతులిత ఆహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. దీనికి తోడు బాడీ కూడా ఫిట్ గా ఉంటుంది. ఫలితంగా శృంగార కోరికలు కూడా ఎక్కువగా పుడుతాయి. దీంతో పార్ట్నర్ ను తృప్తి పరిచేందుకు బాగా ఉపయోగపడుతుంది.
* పుచ్చకాయ తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులోని ఎల్ ఆర్టినైన్, శరీరంలోని నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ ను పెంచుతుంది. ఇది లైంగిక అవయవాలకు రక్త ప్రసరణను పెంచి కోరికలను బలంగా మార్చుతుంది.
* యాపిల్ లో క్వెర్సిటిన్ సమ్మేళనం ఉంటుంది. ఇది లైంగిక ఆసక్తిని పెంచడంలో సహాయపడుతుంది. యాపిల్ ఎక్కువగా తింటే లైంగిక సామర్థ్యం కూడా రెట్టింపు అవుతుంది.
* అల్లం వివిధ రూపాల్లో తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. అల్లం తింటే రక్తప్రసరణ మెరుగ్గా జరిగి. లైంగిక ఆసక్తి పెరుగుతుంది.
* అరటి పండులోని పొటాషియం రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. దీంతో లైంగిక అవయవాల సామర్థ్యం పెరుగుతుంది. ఫలితంగా సెక్స్ పై ఇంట్రస్ట్ కూడా పెరుగుతుంది.
* గుడ్లలో అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఎల్-ఆర్జినైన్ లైంగిక అవయవాలకు రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. లైంగిక అవయవాల పనితీరును మెరుగు పరుస్తుంది.
*నత్తగుళ్లలు తింటే శరీరంలో టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్ స్థాయిలు మెరుగవుతాయి. వీటిని తింటే కోరికలు పెరిగి సామర్థ్యం రెట్టింపు అవుతుంది.
* అవకాడోలో ఆరోగ్య కరమైన కొవ్వులు, విటమిన్ బీ అధికంగా ఉంటుంది. ఇవి రక్త ప్రసరణలను మెరుగు పర్చడంలో తోడ్పడతాయి. ఫలితంగా లైంగిక శక్తి పెరుగుతుంది.
* దానిమ్మ పండుగా తీసుకున్నా.. జ్యూస్ గా తీసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు లైంగిక అవయవాలకు రక్త ప్రసరణను పెంచి కోరికలను ఉత్తేజింప చేస్తాయి.

TAGS