SRH Vs CSK : ఐపీఎల్-2024 సీజన్ 17లో పడుతూ లేస్తూ ఆపసోపాలు సాగుతున్న టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈ జట్టు మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. సొంతగడ్డపై జరగనున్న ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే తాడో పేడో తేల్చుకోనుంది.
కేకేఆర్ (కల్‌కత్తా నైట్ రైడర్స్)తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో తృటిలో విజయావకాశాలను చేజార్చుకున్న ఆరెంజ్ ఆర్మీ.. ముంబై ఇండియన్స్ వేదికగా సొంతగడ్డపై జరిగిన సెకండ్ మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది. విధ్వంసకరమైన బ్యాటింగ్‌తో టీ-20 క్రికెట్ చరిత్రలోనే 277 పరుగుల స్కోర్‌ను నమోదు చేసింది. సన్ రైజర్స్ దాటికి ముంబై ఇండియన్స్ 31 పరుగుల తేడాతో చిత్తయ్యింది.
గెలుపే లక్ష్యంగా..
ఆ జోరును మత్రం సన్ రైజర్స్ తర్వాతి మ్యాచ్‌లో చూపించలేకపోయింది. గుజరాత్ టైటాన్స్‌తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ క్రమంలోనే మళ్లీ విజయాల బాట పట్టేందుకు ప్యాట్ కమిన్స్ కేప్టెన్సీలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫోకస్ పెట్టింది.
బ్యాటర్ మయాంక్‌పై వేటు..
చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ వ్యూహాలు రచిస్తోంది. దీనిలో భాగంగా టీమ్ మార్పులు చేసింది. వరుసగా 3 మ్యాచ్‌లలో విఫలమైన ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను పక్కన పెట్టి రాహుల్ త్రిపాఠిని ఆడించే అవకాశం ఉంది. గతంలో ట్రావిస్ హెడ్‌తో కలిసి అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేసేవారు. రాహుల్ త్రిపాఠి ఫస్ట్ డౌన్‌లో వచ్చేవాడు.
బౌలింగ్‌లో నటరాజన్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా దించనుంది. అవసరమైతే గత మ్యాచ్ లలో విఫలమైన జయదేవ్ ఉనాద్కత్‌పై కూడ వేటు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మిగతా టీమ్ ను పరిశీలిస్తే పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు.