JAISW News Telugu

Sharmila – Bhuvaneshwari : షర్మిలకు, భువనేశ్వరికి ఉన్న తేడా ఇదే

Sharmila Vs Bhuvaneshwari

Sharmila – Bhuvaneshwari

Sharmila – Bhuvaneshwari : కేసరవెళ్లిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మంత్రుల ప్రమాణ స్వీకారంలో అపురూపమైన దృశ్యాలు కనిపించాయి. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వేదికపై కూర్చున్న తన చెల్లి భువనేశ్వరి వద్దకు వెళ్లి ఆప్యాయంగా నుదుటిపై ముద్దుపెట్టుకొని ఆశీర్వదించారు. ఆమె కూడా అన్న దీవెనలను అందుకుంది. దీన్ని చూసి అందరూ సంతోషం వ్యక్తం చేశారు.

చంద్రబాబు, లోకేష్‌ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు, బ్రాహ్మణి ఆమె కుమారుడు సంతోషంతో చప్పట్లు కొట్టారు. వారి వెనుక వరుసలో కూర్చున్న నందమూరి రామకృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు ఉద్వేగానికి లోనయ్యారు. పవన్‌ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆయన భార్య అన్నా లెజినోవా సంతోషంతో చప్పట్లు కొడుతూనే ఉంది. ఇక జన సైనికుల ఈలలు, గోలలతో ప్రాంగణం దద్దరిల్లిపోయింది.

పనవ్ ప్రమాణ స్వీకారం తర్వాత చంద్రబాబు, మోడీల వద్దకు వెళ్లి పాధాభివందనం చేయబోయారు, కానీ వారు వారించారు. ఆ తర్వాత చిరంజీవి వద్దకు వెళ్లి ఆయన వారిస్తున్నా పవన్‌ పాదాభివందనం చేశారు. పవన్‌ కళ్యాణ్‌ అన్నకు ఇచ్చిన గౌరవం చూసి సభాప్రాంగణం చప్పట్లతో దద్దరిల్లిపోయింది. రామ్ చరణ్‌ కూడా ఉద్వేగానికి లోనయ్యారు. ప్రమాణ స్వీకారం ఘట్టం ముగిసిన తర్వాత మోడీ సమక్షంలో చిరంజీవి, పవన్‌ ను ఆప్యాయంగా కౌగిలించుకొని ఆశీర్వదిస్తుంటే మరోసారి చప్పట్లతో ప్రాంగణం దద్దరిల్లింది.

ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నందమూరి బాలకృష్ణ, పవన్‌ కళ్యాణ్‌, చిరంజీవి ముగ్గురూ వేదిక దిగివచ్చి నందమూరి రామకృష్ణ, ఆదిశేషగిరి రావు, రామ్ చరణ్‌, తదితరులను ఆప్యాయంగా పలకరించారు. ఈ ప్రమాణ స్వీకారంలో ఇన్ని భావోద్వేగాలు, అనుబంధాలు చూస్తున్నప్పుడు అందరికీ జగన్‌-విజయమ్మ-షర్మిల కళ్ల ముందు మెదిలారు.

గత ఎన్నికల ముందు జగన్ చిన్నాన్న వివేకా హత్య తర్వాత జగన్ వ్యవహరించిన తీరు రాష్ట్రం యావత్తు చూసింది. తన కోసం తన అన్న సీఎం అయ్యేందుకు ఎంతగానో శ్రమించిన చెల్లి షర్మిలతో, తల్లి విజయమ్మని జగన్ అవమానకరంగా పార్టీని, రాష్ట్రం కూడా వీడిపోయేలా చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చెల్లెళ్లు షర్మిల, సునీతా రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎంత విమర్శించారో, చివరికి తల్లి విజయమ్మ కూడా కూతురికే మద్దతిచ్చారు. ఈ విధంగా సొంత కుటుంబ సభ్యుల ఉసురు తగిలి జగన్ అధికారం కోల్పోయారు.

నందమూరి, నారా, కొణిదెల కుటుంబాలు బంధాలతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్టుంటే జగన్ మాత్రం అందరినీ ద్వేషిస్తూ శత్రువులుగా మార్చుకొని ఓటమిని కొని తెచ్చుకొని ఒంటరివాడిగా మిగిలిపోయారు. 

Exit mobile version