JAISW News Telugu

Hrudaya Kaleyam : ‘హృదయ కాలేయం’లో సంపూ పాత్ర మిస్ చేసుకొన్న కమెడియన్ ఇతనే.. ఎందుకో తెలుసా?

Hrudaya Kaleyam

Hrudaya Kaleyam

Hrudaya Kaleyam : సాధారణంగా ఎక్కువ మంది బుల్లితెర నుంచి వెండితెరకు వెళ్తారు. కొన్నాళ్లు ఒక వెలుగు వెలిగి.. తర్వాత మళ్లీ బుల్లితెరకు వస్తారు. కానీ అప్పారావు కెరీర్ మాత్రం రివర్స్ లో వెళ్లింది. 50కి పైగా సినిమాల్లో నటించిన ఆయనకు గుర్తింపు దక్కలేదు. జబర్ధస్త్ షోలో మంచి గురించి దక్కింది. తిరిగి సిల్వర్ స్క్రీన్ పై వెళ్లడంలో మరింత పాపులర్ అయ్యాడు.

మల్లెమాల ప్రొడక్షన్ హౌజ్ నుంచి వచ్చిన కామెడీ షో ‘జబర్ధస్త్’ ఎంతో మంది కమేడియన్లను ఇండస్ట్రీకి ఇచ్చింది. అందులో ఎవరి పంతా వారిదే అయినా.. వారిలో ఒక డిఫరెంట్ ఫేమస్ పర్సన్ అప్పారావు. తన శరీరాకృతి, కామెడీ టైమింగ్స్ అందరికీ బాగా నచ్చేవి. ఆయన ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు చెప్పుకచ్చారు. హృదయ కాలేయం సినిమా లో హీరోగా పస్ట్ తనకే ఛాన్స్ వచ్చిందని చెప్పారు.

ఇండస్ట్రీకి ఇలా వచ్చా..
వైజాగ్‌కు చెందిన అప్పారావు (ఆసమ్ అప్పి టీం) చదువు పూర్తయిన వెంటనే ఇండస్ట్రీలోకి వచ్చారు. సత్యానందం మాస్టారు వద్ద శిక్షణ తీసుకున్న ఆయన బీవీ రమణ దర్శకత్వంలో ‘శుభవేళ’ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత ‘గోపీ గోపికా గోదావరి’, ‘వేదం’, ‘శ్రీఆంజనేయం’, ‘నేనింతే’, ‘చందమామ’, ‘మనం’, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల్లో నటించి ఫేమస్ అయ్యారు.

నటుడిగా సుదీర్ఘ కాలం సందడి చేసిన అప్పారావు.. జబర్ధస్త్ లోకి వచ్చారు. ఇందులో కామెడీని పంచుతూ హైలైట్ అయ్యారు. అలా చాలా కాలం తన ప్రభావాన్ని చూపించిన అప్పారావు.. ఈ షోతో సెన్సేషన్‌ అయ్యారు. అలాంటిది కొన్నేళ్ల నుంచి ఆయన జబర్ధస్త్ లో కనిపించ లేదు. కానీ, సినిమాల్లో మాత్రం కనిపిస్తున్నారు.

తాజాగా అప్పారావు ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కెరీర్ తో పాటు పర్సనల్ విషయాలను సైతం షేర్ చేసుకున్నారు. ఇందులో ఆయన ‘చాలా మంది అంటున్నట్లుగా నాకు డబ్బు పిచ్చి ఉంది. డబ్బంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా దగ్గర డబ్బు లేదు కాబట్టి. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నేను ఎన్నో బాధలు అనుభవించా. నా కూతురి పెళ్లి కూడా నా భార్య కష్టంతో చేయాల్సి వచ్చింది’ అని చెప్పుకొచ్చారు.

‘జబర్ధస్త్‌కు రాక ముందు 50కి పైగా సినిమాల్లో నటించా. కానీ, అప్పుడు నన్ను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈ షోకు వచ్చిన తర్వాత వందకు పైగా సినిమాల్లో నటించా. ఏ వేషంలో ఉన్నా నాకు ఫోన్ చేసి మరీ వేషం, నటన గురించి చెప్తున్నారు. అంతలా జబర్ధస్త్ నాకు గుర్తింపు తెచ్చింది’ అంటూ గర్వంగా వెల్లడించారు.

హృదయ కాలేయం హీరో
‘వేర్ ఈజ్ విద్యాబాలన్’ అనే సినిమా షూటింగ్ సమయంలో హీరో సంపూర్ణేశ్ పాత్రకు అసిస్టెంట్‌ క్యారెక్టర్ చేశాను. ఆ సమయంలో ఆయన నాకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. బాబాయ్ హృదయ కాలేయం సినిమాకు ఫస్ట్ మిమ్మల్ని హీరోగా అనుకున్నారని చెప్పాడు.’ ఆయన ఇంకా మాట్లాడుతూ ‘హృదయ కాలేయం’లో నిన్నే హీరోగా అనుకున్నారట. కానీ, చాలా సినిమాల్లో నటించావు కాబట్టి కొత్త వారు అయితే బాగుండేదని అనుకొని నాకు ఆఫర్ ఇచ్చారట. ఇలా నీకు హృదయ కాలేయం రాలేదట.’ అని చెప్పారట. అప్పారావు ఆ సినిమాపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

Exit mobile version