JAISW News Telugu

Maruti Vitara Brezza : తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉన్న కారు ఇదే.. అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్..!

Maruti Vitara Brezza

Maruti Vitara Brezza : ఒక చిన్న కారు ప్రతీ మధ్య తరగతి వాడి కనీస అవసరం. అయితే తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉన్న కార్ల కోసం ఎదురు చూడాల్సిందే. అందులో కంపెనీ, ఫీచర్స్ చూసి ఎన్నుకుంటేనే మేలని ఆయా కంపెనీల వారు సూచిస్తున్నారు. ఇక్కడ ఒక కారు తక్కువ ధరలో మంచి ఫీచర్స్ తో ఉంది. అదే మారుతీ విటారా బ్రెజ్జ SUV దాని గురించి తెలుసుకుందాం.

మారుతీ బ్రెజ్జా ఫ్యూచర్స్..
అసాధారణమైన ఇంధన సామర్థ్యంలో ఇండియన్ మార్కెట్ లోకి అడుగుపెట్టిన వాహనం మారుతి సుజుకీ బ్రెజ్జా. ప్రస్తుతం కంపాక్ట్ SUV సెగ్మెంట్ లో బలమైన పోటీదారుగా నిలిచింది. ఈ వాహనం అద్భుతమైన డిజైన్, గ్రిల్ తో చూసేందుకు అట్రాక్షన్ గా కనిపిస్తుంది.

ఆకట్టుకునే ఎల్ఈడీ హెడ్ లైట్స్, టెయిల్ లాంపులు ఉన్నాయి. ఇక విశాలమైన ఇంటీరియర్ సీటింగ్ కోసం విశాలమైన లెగ్ రూమ్ అలాగే హెడ్ రూం అందిస్తుంది. కుటుంబంతో కలిసి దూర ప్రయాణం చేయాలనుకునే వారికి ఈ వాహనం ఉపయోగపడుతుంది. ఇక సేఫ్టీ, ఫీచర్స్ విషయానికస్తే.. 6 ఎయిర్ బ్యాగులను కలిగి ఉంది. EBDతో ABS బ్రేకింగ్ టైంలో వీల్ లాక్ ఆప్ నిరోధించడం సరైన స్టాపింగ్ పవర్ ఉంటుంది. isofix చైల్డ్ సీట్ మౌంట్ లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ తో ఆకస్మిక మలుపులు వచ్చినప్పుడు స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది.

ఇంజిన్ విషయానికి వస్తే.. బ్రెజ్జా 2024 ఫిల్టర్డ్ 1.5 లీటర్ K సిరీస్ పెట్రోల్ ఇంజిన్ తో పని చేస్తుంది. 103 బీహెచ్‌పీ శక్తి 138 ఎన్ఎం టార్క్ అందిస్తోంది. ఇది సిటీలో ట్రాఫిక్ నావిగేట్, హైవేలో సులభంగా ప్రయాణించేందుకు స్పెషల్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. బ్రెజ్జా హైస్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో 20 KMPL. మృదువైన 6 స్పీడ్ ఆటోమేటెడ్ ట్రాన్స్ మిషన్ తో 18.75Kmpl వీటితో కంపాక్ట్ SUV ఆకట్టుకుంటాయి.

బ్రెజ్జా-2024 ఆన్ రోడ్ వేరియంట్ ధర రూ: 8లక్షల నుంచి రూ. 12లక్షల వరకు ఉంది. ఈ రేటు నగరాలను బట్టి మారవచ్చు. స్మార్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్, మ్యూజిక్ స్ట్రీమింగ్ యూజర్ ఫ్రెండ్లీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ఉంన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టం కూడా ఉంది. దీంతో క్యాబిన్ ఉష్ణోగ్రత అందిస్తుందట. సుదీర్ఘ ప్రయాణాలకు ఈ వాహనం అత్యంత సౌకర్యకరంగా ఉంటుంది.

Exit mobile version