Busiest airport : దేశంలో ఇదే బిజియెస్ట్ ఎయిర్ పోర్టు.. రోజుకు ఎంత మంది ప్రయాణం చేస్తారంటే..?

busiest airport : వాయుమార్గం పెరగడంతో ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. ఏ దేశం నుంచి ఏ దేశం వెళ్లాలన్నా తక్కువ సమయాన్ని ఈ వాయుమార్గం కల్పిస్తుంది. కాబట్టి ఎక్కువ మంది దీన్నే ఆశ్రయిస్తుంటారు. దీంతో ఎయిర్ పోర్టులో చాలా బిజీగా బస్టాండ్ లుగా మారుతున్నాయి. దేశంలోనే అత్యంత బిజియెస్ట్ ఎయిర్ పోర్టు గురించి తెలుసుకుంటే.. అది ‘ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం.’ 6.55 కోట్ల ప్రయాణికుల కంటే ఎక్కువ రద్దీని కలిగి ఉండడం ద్వారా భారతదేశం, ఆసియాలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంగా గుర్తింపు సంపాదించుకుంది. ఏటా (65.5 మిలియన్లు) ప్రయాణికులు. ఇది దేశ రాజధాని, ఢిల్లీ, ఇతర సమీప ప్రాంతాలకు సేవలు అందిస్తుంది. దీన్ని సాధారణంగా నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) అని పిలుస్తారు. IGI విమానాశ్రయం కార్గో టెర్మినల్‌తో పాటు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు 3 టెర్మినల్స్‌ను కలిగి ఉంటుంది. ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్ 3 ఇటీవల ప్రారంభించారు. ఏటా 3.4 కోట్ల (34 మిలియన్లు) ప్రయాణికుల రాకపోకలను తట్టుకునేలా దీన్ని నిర్మించారు. ఇది దక్షిణాసియాలో అతిపెద్ద విమానయాన కేంద్రంగా మారింది.

ఎయిర్‌ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ ప్రకారం.. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటి. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్ ఇండియా, అలయన్స్ ఎయిర్, ఫెడెక్స్ ఎక్స్‌ప్రెస్, క్విక్‌జెట్ ఎయిర్‌లైన్స్ మరియు విస్తారా వంటి వివిధ విమానయాన సంస్థలకు ప్రధాన కేంద్రంగా ఉంది. విమాన ట్రాఫిక్‌ను సులభతరం చేసేందుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొత్త అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రకటించింది అదే జేవార్ ఉత్తరప్రదేశ్‌లోని ‘నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం’ ఇది ఏప్రిల్, 2025 నాటికి తన సేవలను ప్రారంభిస్తుంది.

TAGS