JAISW News Telugu

Hijras : హిజ్రాలకు రాములోరు ఇచ్చిన వరమిదే..అందుకే వారితో అందరూ అలా..

Hijras

Hijras

Hijras : రాములోరు హిజ్రాలకు ఇచ్చిన వరం గురించి మీకు తెలుసా? ఈ విషయం చాలా మందికి తెలియదు. దీని గురించి ప్రచారంలో ఉన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి సన్నిధానంలో ప్రతీ సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణం కన్నులపండువగా జరుగుతుంది. లక్షలాది శివపార్వతులు, శివసత్తులు, జోగినులు, హిజ్రాలు వచ్చి స్వామి వారి దివ్య కల్యాణాన్ని తిలకించి సేవలో తరిస్తారు.

శ్రీరామంద్ర ప్రభు వనవాసం వెళ్లే సమయంలో.. సాగనంపే క్రమంలో వచ్చిన మహిళలు, మగవారిని అందరినీ తమ తమ ఇండ్లకు వెళ్లాలని చెబుతారని, అటు ఇటు కానీ మమ్మల్ని అంటే హిజ్రాలకు ఏం చెప్పకుండా..ఉండడంతో శ్రీరాముడు వనవాసం పూర్తి చేసే వరకు అక్కడే ఉండి దర్శనం ఇస్తారు. దీంతో అనుగ్రహించిన శ్రీరాముడు.. ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా దీవించే శక్తి మీకు ఉంటుందని శ్రీరాముడు వరమిచ్చారని హిజ్రాలు తెలిపారు. వనవాసం వెళ్లి వచ్చేంత వరకు కూడా శ్రీరాముడి ఆజ్ఞ కోసమే ఉన్నామయ్య.. అంటూ హిజ్రాలు స్వామివారికి చెప్పడంతో.. స్వామి వారు కరుణించి వారికి ఈ  వరం ఇచ్చాడని వారు చెప్పారు.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో ప్రతీ సంవత్సరం జరిగే శివ కల్యాణం, శ్రీరామనవమి, కల్యాణ వేడుకలకు శివసత్తులు, జోగినిలు, శివపార్వతులు, హిజ్రాలు అధిక సంఖ్యలో సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి తమ ఆచార వ్యవహారాలతో, సంప్రదాయాలతో స్వామివార్లకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని చెబుతున్నారు.

శ్రీరామనవమి సందర్భంగా వేములవాడ జాతరకు లక్షలాది హిజ్రాలు తరలివచ్చి సందడి చేస్తారు. శ్రీరామ నవమి వేడుకల్లోనూ, ఆ తర్వాత రాజరాజేశ్వరస్వామిని, పోచమ్మను దర్శించుకుంటారు. పోచమ్మ బోనాల సందర్భంగా వారు చేసే విన్యాసాలు అబ్బురపరుస్తాయి. వీధులన్నీ జనాలతో కళకళలాడుతూ సంబరాలు అంబరాన్నంటుతాయి. ఈ పండుగ రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లోని హిజ్రాలు కూడా ఇక్కడికి వేడుకల్లో పాల్గొంటారు. వారి ఆటపాటలకు ఇక్కడ కొదువుండదు. రైళ్లలో, బస్ స్టేషన్ లలో ప్రయాణికులను ఇబ్బంది పెట్టే హిజ్రాలు ఇక్కడ చాలా సంప్రదాయంగా, భక్తిపూర్వకంగా ఉంటారు. తమ ఆరాధ్య దైవాన్ని ప్రార్థించుకునేందుకు నిష్టగా ఉంటారు.

Exit mobile version