Stunts on a bicycle : సోషల్ మీడియా అంటేనే ప్రస్తుతం సాహసాలకు అడ్డాగా మారుతోంది. యాప్ ఓపెన్ చేస్తే చాలు.. ఏదో ఒక విన్యాసాలకు సంబంధించిన వీడియోలు దర్శనమిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఓ వ్యక్తి సైకిల్ పై చేసిన విన్యాసాలకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. చాలా మంది భయబ్రాంతులకు గురిచేసే వీడియోలను చేస్తూ అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యపరుస్తుంటారు. అయితే తాజాగా ఓ వ్యక్తి కూడా అలాగే చేశాడు.
నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి సైకిల్ పై విన్యాసాలు ప్రదర్శించాడు. సైకిల్ ను పైకి ఎత్తుతూ ముందు టైర్ తీసి నడిపాడు. ముందు టైర్ తీయడంలో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. అనంతరం సైకిల్ తొక్కుతూనే టైర్ పైకి లేపి ఆ ముందు టైర్ ను చేతితో పట్టుకుని వెనక్కి వెళ్లాడు. అనంతరం మళ్లీ సైకిల్ ముందు భాగానికి మళ్లీ టైర్ ను జోడించాడు. ఇలా ఆ వ్యక్తి చేసిన విన్యాసాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
That’s really impressive 🚀
📹 Jake100 pic.twitter.com/Lmqk8TkmHg
— Yogesh Kumar (@YKwolfpec) May 23, 2024