Beer : భానుడి ఉగ్రరూపంతో రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. దీంతో చల్లదనం కోసం జనాలు బీర్లు తాగుతున్నారు. బీర్లు తాగడమంటే మామూలుగా కాదు గతేడాది కంటే ఎక్కువ మొత్తంలో బీర్లు తాగేస్తున్నారు.. రికార్డులు సృష్టిస్తున్నారు. దీంతో ఎన్నడూ లేనంతగా బీర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఆదివారమైతే చాలు వైన్స్ లలో బీర్లు దొరకడం లేదు. దీంతో బెల్ట్ షాపుల్లో అదనంగా డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కుంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి 18వ తేదీ వరకు రూ.670 కోట్ల విలువైన 23 లక్షల కేస్ ల బీర్లు తాగారు. ఇది ఆల్ టైమ్ రికార్డు. ఎక్సైజ్ అధికారులే ఆశ్చర్యపోతున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 28 శాతం అధికంగా బీర్ల అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల బీర్ల కొరత కారణంగా చాలా మంది వెనుదిరిగి పోతున్నారు. కోరుకున్నా బీరు తాగలేకపోయామని బాధపడుతున్నారు.
బీర్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ఎండల ప్రభావంతో చల్లదనం కోసం అందరూ ఎగబడుతున్నారు. దీంతో బీర్ల కొరత ఏర్పడుతోంది. ప్రముఖ పట్టణాల్లో బీర్ల కొరత ఉందని తెలియడంతో చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్లి మరీ తెచ్చుకుంటున్నారు. తాగాలని అనిపించినప్పుడు తాగకపోతే బాగుండదని ఎంత కష్టమైనా సరే బీరు సంపాదించుకోవాలని చూస్తుంటారు.
రోజురోజుకూ బీర్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. డిమాండ్ విపరీతంగా ఏర్పడటంతో సప్లయ్ తగ్గింది. దీంతో బీర్ల కొరత ఏర్పడుతోంది. తగినన్ని బీర్లు అందుబాటులో లేకపోవడంతో మద్యం ప్రియులు నిరాశ చెందుతున్నారు. ఎండలో చల్లని బీరు వేద్దామంటే కుదరడం లేదని బాధపడుతున్నారు. ప్రభుత్వం తగినన్ని బీర్లు ఉత్పత్తి చేసి వారి ఆశలు తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుతున్నారు.
దీనికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది. సరైన స్థాయిలో బీర్లు ఉత్పత్తి చేస్తుందా? లేక కొరతలు ఇలాగే కొనసాగిస్తుందా? తెలియడం లేదు. ఈ నేపథ్యంలో మద్యం ప్రియుల ఆశలు తీరుస్తుందో లేదో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.