Mallikarjun Kharge : ఈ ఎన్నికలు ప్రజలు Vs మోదీ మధ్యే..: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
Mallikarjun Kharge : ఈ ఎన్నికలు పీఎం నరేంద్ర మోదీకి, ప్రజలకు మధ్య జరుగుతున్నాయని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అన్నారు. ఇండియా కూటమి అభ్యర్థి మనోజ్ కుమార్ తరపున బీహార్ లోని ససరంలో ఆదివారం (మే 26) ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముస్లింల ఓటు బ్యాంకు ముందు ఇండియా కూటమి అవసరైతే ముజ్రా డ్యాన్స్ చేస్తుందంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి బీహార్ ను అవమానించారని పేర్కొన్నారు.
ప్రధాని తనను తాను తీస్మార్ ఖాన్ అనుకుటున్నారని, అయితే ప్రజలే అసలైన తీస్మార్ ఖాన్ లని గుర్తుంచుకోవాలని అన్నారు. మోదీ మూడోసారి ప్రధాని అయితే ప్రజలు మాట్లాడడానికి కూడా ఏమీ ఉండదన్నారు. ఈ లోక్ సభ ఎన్నికలు ప్రజలు వర్సెస్ మోదీయే తప్ప రాహుల్ వర్సెస్ మోదీ కానే కాదని పేర్కొన్నారు. నరేంద్ర మోదీని దేశ ప్రదానిగా తాను గౌరవిస్తున్నప్పటికీ, కాంగ్రెస్ నేతలకు మాత్రం ఆయన గౌరవం ఇవ్వట్లేదన్నారు. ఆయన కేవలం ధనవంతులనే ఆలింగనం చేసుకుంటున్నారు తప్ప పేదలను కాదని ఖర్గే విమర్శించారు.