Thiruvuru MLA : జర్నలిస్టు దెబ్బకు దిగివచ్చిన తిరువూరు ఎమ్మెల్యే.. చివరికి ఏమన్నాడంటే?

Thiruvuru MLA

Thiruvuru MLA

Thiruvuru MLA : ‘పలిచి పిల్లనిస్తే కులం తక్కువ అన్నాడట’ ఈ సామెత గుర్తుంది కదా.. అయితే ఇదే పిలిచి టికెట్ ఇస్తే పార్టీ చాప కిందకే నీరు తెచ్చిన ఓ ఎమ్మెల్యే గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పేరు కొలికపూడి శ్రీనివాస్ రావు. ఆయనపై ఇటీవల వేలాది సంఖ్యలో చంద్రబాబు నాయుడికి ఫిర్యాదులు వెళ్లాయి. ఆయన నోటి దూల, దుడుకు స్వభావంతో ప్రతిపక్ష పార్టీ నాయకులు కాదు.. సొంత పార్టీ నేతలే ఇబ్బంది పడుతున్నామని బాస్ వద్ద మొరపెట్టుకుంటున్నారు. వారే కాదు.. జర్నలిస్టులు కూడా ఆయనపై ఇటీవల అధినేతను కలిసినట్లు తెలుస్తోంది.

జగన్ ప్రభుత్వంలో వచ్చిన ‘మూడు రాజధానులు’కు వ్యతిరేకంగా పోరాడిన ఉమ్మడి గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన కొలికపూడి శ్రీనివాస్ రావు పోరాడాడు. అప్పటి నుంచి ఆయనకు గుర్తింపు దక్కింది. అమరావతి జేఏసీ కన్వీనర్ గా ఎన్నో పోరాటు చేశారు. ఎన్నో కేసులు, దెబ్బలు తింటు మరీ అమరావతి ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. దీన్ని గుర్తించిన చంద్రబాబు 2024 ఎన్నికల్లో తిరువూరు సీటు కేటాయించారు. టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి జవహర్‌ను పక్కన పెట్టి కొలికపూడికే టికెట్ ఇచ్చారు. వైసీపీ అభ్యర్థి స్వామి దాస్‌ను 21874 ఓట్ల తేడాతో ఓడించాడు.

కూటమి ప్రభంజనం అమరావతి ఉద్యమం రెండు అంశాలు కలిసి వచ్చి శ్రీనివాస్ రావు గెలవనైతే గెలిచాడు. కానీ ఆయన దుడుకు స్వభావం పార్టీకి ఎన్ని చిక్కలు తెచ్చిపెడుతుందో అని పార్టీ వర్గాలు సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. గెలిచిన వెంటనే వైసీపీ నాయకుడి నివాసం కూల్చేందుకు వెళ్లాడు. అది అక్రమ కట్టడమని ఆరోపించి విమర్శల పాలయ్యాడు. దీనిపై బాబు ఎమ్మెల్యేను మందలించాడు. అయినా ఆయనలో ఏ మాత్రం మార్పు రాలేదు.

గత వారం చిట్టెల గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లె శ్రీనివాస్‌పై ఎమ్మెల్యే నోరు పారేసుకున్నాడు. దీంతో ఆయన భార్య కవిత సూసైడ్ కు యత్నించిందన్న వార్తలు వచ్చాయి. దీనిపై ప్రశ్నించిన మీడియా ప్రతినిధులతో ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించాడు. దీంతో సదరు ప్రజా ప్రతినిధులు సీఎం వరకు తీసుకెళ్లారు. దీంతో సీఎం చీవాట్లు పెట్టాడు. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల నిర్వహించిన ఒక సభలో సభా ముఖంగా పాత్రికేయులకు క్షమాపణలు చెప్పారు. ఆ సమయంలో నేను అలా మాట్లాడేది కాదని నొచ్చుకున్న ప్రతీ జర్నలిస్టుకు క్షమాపణలు అన్నారు.

TAGS