Sajjala : కష్ట కాలంలో పార్టీకి అండగా నిలవాలి.. సజ్జలను నిలదీసిన వైసీపీ కార్యకర్తలు

Sajjala
Sajjala Rama Krishna : కష్ట కాలంలో అండగా ఉండాల్సిన నాయకులే పట్టించుకోకపోతే ఎలా అని వైసీపీ కార్యకర్తలు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని నిలదీశారు. కృష్ణా జిల్లా పామర్రులో మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఇంటికి సజ్జల వచ్చారు. ఈ విషయం తెలుసుకొని పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. నేతలతో మాట్లాడి ఆయన వెళ్లిపోతుండగా.. కార్యకర్తలు అడ్డుకొని నిలదీశారు. ఇంతమంది కార్యకర్తలు వస్తే కనీసం పలకరించకుండా వెళ్లిపోవడమేంటని ప్రశ్నించారు. ధైర్యంగా ఉండి పార్టీ కోసం పోరాడాలనే భరోసా ఇవ్వకుండా అలా ఎలా వెళ్లిపోతారని నిలదీశారు. దీంతో చేసేదేమీ లేక సజ్జలతో పాటు అక్కడి నేతలు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.