Fraud in Petrol Stations : మన దేశంలో 140 కోట్లకు పైబడి జనాభా ఉంది. జనాభాలో మన దేశమే నంబర్ వన్ అని తెలిసిందే. అయితే మన దేశంలో నిరక్షరాస్యత కూడా ఎక్కువే. అయితే అక్షరాస్యుల్లో కూడా టెక్నికల్ నాలేడ్జీ చాలా చాలా తక్కువ. అయితే పరిస్థితిలో కొంచెం మార్పు వస్తున్నా దేశంలో ప్రతీ చోట మోసాలు కామన్ అయిపోయాయి.
మనకు బైక్ ,కారో లేనిదే బయటకు అడుగు పెట్టలేం. మనం ఏ పని చేయాలన్నా ఏదో ఒక వాహనాన్ని ఆశ్రయించాల్సిందే. వెనకటి కాలంలో కాలినడకనో, సైకిల్ ద్వారా ప్రయాణించినా.. ప్రస్తుతం వాహన ప్రయాణం తప్పనిసరి. వీధి చివర దుకాణానికి వెళ్లాలన్నా బైక్ తీయక తప్పని పరిస్థితి. వాహనాలు ఇప్పుడు అత్యవసరంతో పాటు సోషల్ స్టేటస్ కూడా. అందుకు ఒక్కొక్కరి ఇంట్లో కనీసం రెండు బండ్లు, ఓ కారు ఉంటున్నాయి. ఈక్రమంలో మనం పెట్రోల్ ,డీజిల్ కూడా అధికంగా వాడుతుంటాం. అయితే పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాలను పెద్దగా పట్టించుకోం. కానీ మనకు చిన్నగా అనిపించే ఇవే దేశవ్యాప్తంగా చూస్తే వందల కోట్లలో ఫ్రాడింగ్ జరుగుతోంది.
మనం పెట్రోల్ పోయించుకునేటప్పుడు అక్కడి బాయ్ జీరో చూడండి సార్ అంటాడు. మనం చూస్తాం.. మనం చెప్పినంత పోశాడా లేదా అనేది చూసుకుని డబ్బులిచ్చి వచ్చేస్తాం కానీ అక్కడే మోసం ఉంది. అయితే మోసం అన్ని పెట్రోల్ బంకుల్లో ఉండదు. పాత పెట్రోల్ బంకుల్లో పాత మిషన్లతో నడుస్తున్న బంకుల్లోనే ఉంటుంది.
ఇంతకీ ఆ మోసం ఏమిటంటే.. మనం పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు మీటర్ రీడింగ్ జీరోతో స్టార్ట్ చేస్తారు. అయితే రీడింగ్ తిరిగేటప్పుడు నంబర్లు 5 లేదా అంతకంటే తక్కువ మాత్రమే జంప్ కావాల్సి ఉంటుంది. 5కు పైనా 10 అలా సెట్ చేస్తే మాత్రం మనకు మోసం జరిగినట్టే. ఎందుకంటే మీటర్ ఫాస్ట్ గా తిరుగుతున్నా పంప్ మాత్రం స్లోగా ఉంటుంది. అంటే మనకు తక్కువ పెట్రోల్ వస్తుంది. మీటర్ రీడింగ్ లో నంబర్లు ఎలా జంప్ అవుతున్నాయో అనేది చాలా ముఖ్యం. అందుకే రీడింగ్ ను జాగ్రత్తగా గమనించాలి.