CM Jagan : మద్యనిషేధం చేశాకే ఓట్లడుగుతామన్నారు? మరి ఏమైంది?

CM Jagan

CM Jagan

CM Jagan : రాజకీయ పార్టీలుకు మ్యానిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని చెబుతారు జగన్. కానీ అందులోని హామీలు మాత్రం అమలు చేయడం లేదు. దీంతో వైసీపీ మ్యానిఫెస్టోలో పొందుపరచిన అంశాలను నెరవేరుస్తున్నారా? అంటే లేదనే సమాధానమే వస్తుంది. గత ఎన్నికలకు ముందు రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పినా ఆ దిశగా ఆలోచించడం లేదు.

కాపురాల్లో చిచ్చుపెట్టే మద్యాన్ని నిషేధిస్తామని చెప్పారు. మూడు విడతల్లో మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ తరువాత ఆ మాట మరిచారు. మద్యం దుకాణాల సంఖ్య పెంచారు. మద్యం రేట్లు ఇష్టారాజ్యంగా పెంచేయడం గమనార్హం. మద్య నిషేధంపై ప్రసంగాలు చేశారు కానీ పనులు మాత్రం చేయలేదు. ఒక్క ఏడాది తగ్గించారు. మద్య నిషేధం విధించాకే ఓట్లు అడుగుతాని సవాలు చేశారు. కానీ ఆ దిశగా చర్యలు మాత్రం తీసుకోలేదు.

చీప్ లిక్కర్ బ్రాండ్లను వినియోగంలోకి తీసుకొచ్చారు. దీంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిశాయి. ఎంత మంది ఆరోగ్యాలు పాడైపోయాయో తెలియలేదు. మద్యం అలవాటు ఉన్న కుటుంబాలు శిథిలమైపోయాయి. ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టి మరీ తాగడంతో ఆర్థిక స్థితులు మారిపోయాయి. మద్యానికి అలవాటు పడిన వారి జీవితాలు బుగ్గి అయిపోయాయి.

మద్యం ద్వారా అత్యధిక ఆదాయం రావడంతో మద్య నిషేధం వైపు ఆలోచించలేదు. నాటుసారా విచ్చలవిడిగా దొరికేలా చేస్తున్నారు. దొంగతనంగా మద్యం సరఫరా చేస్తున్నారు. సరిహద్దు జిల్లాల గుండా ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరిస్తోంది. ఎటు చూసినా మద్యం విచ్చలవిడిగా లభ్యమవడమే దీనికి తార్కాణంగా నిలుస్తోంది.

మద్యనిషేధం గురించి జగన్ ఇచ్చిన హామీని విస్మరించారు. మద్య నిషేధం చేసిన తరువాతే ఓట్లు అడుగుతామని చెప్పిన జగన్ ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారని అంటున్నారు. ఓట్లు అడిగే హక్కు ఆయనకు లేదని తెలుస్తోంది. ఇప్పుడు మద్య నిషేధం చేస్తారా? అది సాధ్యమేనా? అనే వాదనలు కూడా వస్తున్నాయి. దీంతో జగన్ కు ఎదురు దెబ్బలే తగలనున్నాయి.

TAGS