Mrunal Thakur : మన ఇండియన్ సినిమాల్లో ఎవరికైనా హిట్ వస్తే ఇక చాలు నిర్మాతలు ఆమె చాన్స్ ల కోసం తిరుగుతూ ఉంటారు. ఇక మన సౌత్ సినిమాలకు ముఖ్యంగా టాలీవుడ్ కైతే బాలీవుడ్ నుంచే ఎక్కువ మంది హీరోయిన్లు దిగుమతి అవుతుంటారు. బాలీవుడ్ లో పెద్దగా సక్సెస్ కాలేకపోయిన వారి ఫస్ట్ చాయిస్ టాలీవుడే. ఎందుకంటే మన తెలుగు నిర్మాతలు భారీ పారితోషికాలు ఇస్తారు. ఇక్కడ వర్క్ వుట్ అయితే సినిమాలు క్యూకడుతాయి. తద్వారా సౌత్ లో మంచి పేరు, సంపాదన పోగేసుకుని మళ్లీ బాలీవుడ్ షిఫ్ట్ అయిపోతుంటారు. గతంలో కాజల్, తమన్నా, తాప్సీ..ఇలా ఎంతో మంది మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఈ కోవలోనే మరో ‘అందాల ముద్దుగుమ్మ’ వెళ్తోంది.
తెలుగులో ‘సీతారామం’ మూవీతో యూత్ కు పిచ్చెక్కిత్తించిన మృణాల్ ఠాకూర్ ఇప్పుడు బిజీ హీరోయిన్ గా మారిపోయింది. గతేడాది విడుదలైన నాని ‘హయ్ నాన్న’ చిత్రంలో కూడా తన అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. త్వరలోనే రిలీజ్ కాబోతున్న విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’లో కూడా ఆమే హీరోయిన్. తెలుగులో మృణాల్ సినిమాలు వరుస హిట్ అవుతుండడంతో ఫ్యాన్స్ ఆమెను లక్కీ హీరోయిన్ అంటున్నారు.
మృణాల్ కు తెలుగులోనే కాక తమిళంలో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే శివకార్తికేయన్, శింబు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు అగ్ర హీరో అజిత్ సరనన కూడా చోటు దక్కించకుంది. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న మూవీలో ఎంతో మంది బడా హీరోయిన్లను వెతికి..చివరకు మృణాల్ అయితే బాగుంటుందని ఆమెనే సెలక్ట్ చేశారు.
తాజాగా మృణాల్ ఠాకూర్ ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. తొలి రోజుల్లో తాను కూడా బాడీ షేమింగ్ కు గురయ్యానని చెప్పుకొచ్చింది. బాలీవుడ్ చిత్రాల్లో నటించేందుకు ఇబ్బంది పడిందట. మరొకరితో పోలుస్తూ నా నటనను కించపరిచేవారని ఆవేదన వ్యక్తం చేసింది. ఓ సాంగ్ షూటింగ్ టైంలో బరువు తగ్గాలని సలహా ఇచ్చారట. అయితే తగ్గనంటే తగ్గను అని ఘాటుగా రిప్లై ఇచ్చిందట. అలాగే ఓ ఈవెంట్ లో పాల్గొన్నప్పుడు తాను సెక్సీగా లేనని ఓ ఫొటోగ్రాఫర్ కామెంట్ చేశాడట. ఆ పల్లెటూరి అమ్మాయి ఎవరని ఎద్దేవా చేశాడని చెప్పుకొచ్చింది.