Tirumala News : పూలు, బొట్టు పెట్టుకోవద్దంటున్నారు..తిరుమలలో కార్మికుల ఆందోళన..

Tirumala News

Tirumala News

Tirumala News : భూలోక వైకుంఠం తిరుమల ప్రపంచంలోని హిందువులందరికీ పవిత్ర స్థానం. తిరుమలేశుడి సేవలో పాల్గొనని భక్తులు ఉండరు. ప్రతీ హిందూ భక్తులు జీవితంలో ఒక్కసారైనా తిరుమలవాసిని దర్శించుకుంటారు. ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయమే కాదు అతి ఎక్కువగా దర్శించుకునే ప్రాంతం తిరుమలనే. ఓ రకంగా చెప్పాలంటే శ్రీనివాసుడు ఏపీలో కొలువై ఉండడం ఇక్కడి జనాలు చేసుకున్న అదృష్టమని భక్తులు నమ్ముతారు. అయితే కొందరి నిర్వాకం వల్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

తాజాగా ఓ వివాదం ఇక్కడి పాలన లోపాలను ఎత్తిచూపుతోంది. తిరుమలకు వెళ్లే ప్రతీ ఒక్కరూ హైందవ సంప్రదాయాలను కచ్చితంగా పాటించాల్సిందే. భక్తులైనా, అధికారులైనా, అక్కడ పనిచేసే సిబ్బంది అయినా.. అయితే ఇక్కడ పారిశుధ్య నిర్వహణ చేసే ఓ కంపెనీ ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోందని పారిశుధ్య కార్మికులు నిన్న ఆందోళన పట్టారు.

తిరుమలలో పారిశుధ్య పనుల నిర్వహించే పీఎన్ఎస్ అనే కంపెనీ.. తమ సిబ్బంది కట్టుబొట్టుపై ఆంక్షలు విధిస్తున్నట్టు అందులో పనిచేసే కార్మికులు ఆరోపిస్తున్నారు. అలాగే తమ సమస్యలను పరిష్కరించాలని వారు నిన్న ఆందోళన చేశారు. తమను బొట్టు పెట్టుకోవద్దంటున్నారని, గాజులు, పూలు పెట్టుకోవద్దని, చెప్పులు వేసుకోవద్దని అంటున్నారని అలాగే తమకు అవసరమైన సమయంలో సెలవులు కూడా ఇవ్వడం లేదని వాపోయారు. దీనిపై ప్రజా సంఘాలు, కార్మికుల సంఘాలు పీఎన్ఎస్ సంస్థపై మండిపడుతున్నారు. వెంటనే ఆ కంపెనీ యొక్క కాంట్రాక్ట్ ను రద్దు చేయాలని కోరుతున్నాయి.

TAGS