Lok Sabha Elections : పార్లమెంట్ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులకు వింత పరిస్థితి ఎదురైంది. లోక్ సభ అభ్యర్థులు కొందరు వారి ఓటును వారికి వేసుకోలేకపోయారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఇతర నియోజకవర్గాల్లో ఓటు ఉండడంతో ఈ స్థితిని వారు ఎదర్కొంటున్నారు. దీంతో తమ పార్టీ వారికి, కొన్నిచొట్ల ఇతర పార్టీల వారికి ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత నివాసం ఈస్ట్ మారేడుపల్లిలోని మహేంద్రహిల్స్. కంటోన్మెంట్ నియోజకవర్గం ఓటరు లిస్టులో ఆమె పేరుంది. అది మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. దీంతో తన ఓటును తనకు వేసుకోలేకపోయారు.
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నివాసం రాజేంద్రనగర్ పరిధిలో ఉంటుంది. ఇది చేవెళ్ల లోక్ సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ఎంఐఎం నుంచి ఎవరూ పోటీ చేయడం లేదు. దీంతో ఇతర పార్టీ అభ్యర్థికి ఓటు వేయాల్సి వచ్చింది.
మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డికి తాండూరు అసెంబ్లీ పరిధిలో ఓటు ఉంది. అది చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం పరిధిలోనిది. ఈ నేపథ్యంలో తన ఓటును ఇతరులకు వేయాల్సిన పరిస్థి ఏర్పడింది.
చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ తరపున పోటీచేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ కు కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు ఉంది. అది మల్కాజిగిరి లోక్ సభ పరిధిలోకి రావడవంతో తన ఓటును వేరే వారికి వేయవలసి వచ్చింది.
హైదరాబాద్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ సమీర్ కు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు ఉంది. ఈ సెగె్మంట్ సికింద్రాబాదు లోక్ సభ పరిధిలోకి రావడంతో.. ఆయన తన ఓటును తనకు వేసుకోలేకపోయారు.