Pawan Kalyan Fans : సినిమావాళ్లకు స్వార్థం ఎక్కువ అని అంటుంటారు. అది నిజమేనని ఇప్పటి పరిణామాలను చూస్తే తెలుస్తోంది. ఎవరు ఏమైపోతే మాకేంటి మా సినిమాలు ఆడితే చాలు అనుకుంటారు. అందుకే సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా రాజకీయాలకు వెళ్తే వారికి మద్దతుగా నిలబడనే నిలబడారు. ఆయనకు సపోర్ట్ చేస్తే తమకు ఏం వస్తుందిలే అనుకుంటారు. అవసరమైతే అతడికి వ్యతిరేకంగా పనిచేయమంటే చేసేస్తారు కానీ మద్దతుగా నిలబడరు.
గతంలో మెగాస్టార్ అంతటివాడే ప్రజారాజ్యం అనే పార్టీ పెడితే ఒక్క సినిమా వ్యక్తి కూడా బయటకు వచ్చి మద్దతు పలుకలేదు. ఒకరో ఇద్దరో లోలోపల పనిచేశారు తప్ప ఎవరూ బయటకు వచ్చి మద్దతుగా నిలువలేదు. చిరంజీవి అప్పటి నుంచి ఇప్పటి దాక ఎంతో మందికి లైఫ్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఆయన పేరు చెప్పుకొని ఎంతో మంది ఉన్నత స్థాయికి వచ్చారు. ఇప్పుడు కూడా ఇదే సీన్ రిపీట్ అవుతోంది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజకీయరంగంలో ఇప్పుడు కీలక దశలో ఉన్నారు.
పవన్ కల్యాణ్ అభిమానిని అని చెప్పుకునే ఏ హీరో కూడా బయటకు వచ్చి మద్దతు పలుకలేదు. ఒక్క చిరంజీవి, ఇతర కుటుంబ సభ్యులు, నాని, నాగవంశీ వంటి వారు మాత్రమే మద్దతుగా నిలిచారు. జబర్దస్త్ కమెడియన్లు ఆది, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ వంటి సైతం ప్రచారం చేస్తున్నా సినిమా వాళ్లు అయితే మరీ దారుణం. పవన్ అభిమానులుగా చెప్పుకునే నితిన్, నిఖిల్, ఇతర యంగ్ హీరోలు కూడా మద్దతు పలుకడం లేదు. ఇక సీనియర్ హీరోల పరిస్థితి దారుణం. పవన్ అంటే ఎవరో తమకు తెలియనట్టే ప్రవర్తిస్తారు.
తమకు ఆదాయం తెచ్చి పెట్టే ఆంధ్రప్రదేశ్ బాగోగులు వారికి అవసరం లేదు. సినిమా హిట్ అయ్యి తమకు పైసలు వస్తే చాలు అనుకుంటున్నారు చాలా మంది. ఏపీలో రాజకీయంగా భ్రష్టు పట్టిపోయినా, అభివృద్ధి లేక అధ:పాతాళానికి పోయినా, ఒక రాజధానంటూ లేకపోయినా..వారికి ఏమాత్రం బాధలేదు. తోటి నటుడు పోటీ చేస్తున్నాడు..అతడికి మద్దతుగా నిలుస్తే రేపటి రోజుల్లో ఏపీలో సినిమా రంగ అభివృద్ధికి కృషి చేస్తాడనే ఆలోచన కూడా లేదు వారికి.