Movies : సినిమాల కోసం నాన్ వెజ్ మానేసి మరీ పాత్రలో లీనమైంది వీరే..

Movies

Movies

Movies : కొంతమంది నటీనటులు చాలా సినిమాల్లో డెడికేటేడ్ గా నటిస్తుంటారు. క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టి పని చేస్తుంటారు. అలాంటి సమయంలో కొన్ని సార్లు ఇష్టమైన వంటకాలను కూడా మానేస్తుంటారు. చాలా మంది హీరోలకు నాన్ వెజ్ అంటే ఇష్టం ఉంటుంది. కానీ క్యారెక్టర్ చేసే సమయంలో వాటిని తినకుండా శ్రద్ధగా నటిస్తుంటారు. అందులో మొదటగా చెప్పుకోవాల్సిన వ్యక్తి నందమూరి తారకరామారావు.

సీనియర్ ఎన్టీఆర్ రాముడు, కృష్ణుడి పాత్రలు చేసే సమయంలో ఏ రోజు కూడా నాన్ వెజ్ తినలేదంట.  ఆ పాత్రలకు ఉన్న గొప్పదనాన్ని పోగొట్టడం ఇష్టం లేక అలా చేశారని తెలుస్తోంది. ఇప్పటి తరం నటులకు, సామాన్య ప్రజలకు కూడా రాముడన్న, కృష్ణుడన్న సీనియర్ ఎన్టీఆరే గుర్తుకువస్తారు. అలాంటి గొప్ప వ్యక్తి ఇలా సినిమాల కోసం నాన్ వెజ్ మానేశారంటే సినిమాలపై అందులోని పాత్రలపై ఎంతో ఇష్టం ఉంటేనే సాధ్యం.

తెలుగులో మరో పెద్ద హిరో నాగార్జున షిర్డీ సాయి సినిమా చేసే సమయంలో నాన్ వెజ్ మొత్తం మానేశానని ఆయనే ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. కన్నడ నటుడు రిషబ్ శెట్టి కాంతార మూవీలో నటించగా.. ఆ సినిమా చేసినన్నీ రోజులు నాన్ వెజ్ కు దూరంగా ఉన్నాడు. అక్షయ్ కుమార్ కూడా ఓ మైగాడ్ 2 మూవీలో నటిస్తున్నాడు. ఇందులో శివుడి పాత్రలో కనిపించనున్నాడు.

దీని కోసం ఆయన నాన్ వెజ్ మానేశాడు. పవన్ కల్యాణ్ సాయిధమ్ తేజ్ కలిసి చేసిన బ్రో సినిమాలో దేవుడి పాత్రలో నటించగా, షూటింగ్ సమయంలో కేవలం వెజ్ మాత్రమే తిన్నట్లు సమాచారం. అల్లు అర్జున్ సైతం దువ్వాడ జగన్నాథం డీజే సినిమాలో బ్రాహ్మణుడి పాత్ర పోషించారు. ఆ సమయంలో అర్జున్ పూర్తిగా వెజిటేరియన్ గా మారిపోయారు. అందుకే చాలామందికి సినిమా అంటే పిచ్చి అని ఇట్టే తెలిసిపోతుంది.

TAGS